కొవిడ్‌ కేర్‌ కేంద్రం ప్రారంభం

ABN , First Publish Date - 2021-05-11T05:24:32+05:30 IST

కరోనా బారిన పడిన వారికి పూర్తిస్థాయిలో వైద్య సేవల ందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తహసీల్దార్‌ వీవీ సన్యాసిశర్మ, ఎం పీడీవో జి.చంద్రరావు తెలిపారు.

కొవిడ్‌ కేర్‌ కేంద్రం ప్రారంభం

గరుగుబిల్లి, మే 10: కరోనా బారిన పడిన వారికి పూర్తిస్థాయిలో వైద్య సేవల ందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తహసీల్దార్‌ వీవీ సన్యాసిశర్మ, ఎం పీడీవో జి.చంద్రరావు తెలిపారు. సోమవారం ఉల్లిభద్రలోని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన కళాశాల ప్రాంగణంలో కొవిడ్‌ కేర్‌ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 350 పడకలను అందుబాటులోకి తెచ్చామన్నారు. వైరస్‌ సోకిన వారు ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలన్నారు. కేంద్రంలో చికిత్స పొందేవారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. తాగునీరు, విద్యుత్‌తో పాటు అవసరమైన మందులు, సిబ్బందిని అందుబాటులో ఉంచామన్నారు.  ప్రభుత్వం నిర్ధేశించిన మెనూ ప్రకారం పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించనున్నామన్నారు. పరిసరాల పరి శుభ్రతతో పాటు పారిశుధ్య నిర్వహణకు సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. పార్వతీపురం, కొమరాడ మండలాల నుంచి వచ్చిన కరోనా బాధితులకు సేవలు ప్రారంభించారు. ఈవోపీఆర్‌డీ ఎల్‌.గోపాలరావు, ఆర్‌ఐ జి.శ్రీనివాసరావు, కార్యదర్శి కోటేశ్వరరావు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-05-11T05:24:32+05:30 IST