బ్యాంకులకు కొవిడ్‌ ఎఫెక్ట్‌

ABN , First Publish Date - 2021-05-11T04:26:54+05:30 IST

బ్యాంకులపై కరోనా ప్రభావం పడింది. మండల కేంద్రంలోని యూనియన్‌ బ్యాంకు, స్టేట్‌ బ్యాంకు బ్రాంచిలు సోమవారం మూతపడ్డాయి.

బ్యాంకులకు కొవిడ్‌ ఎఫెక్ట్‌
రావికమతంలో మూతపడ్డ యూనియన్‌ బ్యాంకు

రావికమతంలో యూబీఐ, ఎస్‌బీఐ బ్రాంచిల మూత

రావికమతం, మే 10:
బ్యాంకులపై కరోనా ప్రభావం పడింది. మండల కేంద్రంలోని యూనియన్‌ బ్యాంకు, స్టేట్‌ బ్యాంకు బ్రాంచిలు సోమవారం మూతపడ్డాయి. యూనియన్‌ బ్యాంకు సిబ్బందిలో మరొకరికి కరోనా సోకడంతో బ్రాంచికి తాళాలు వేశారు. ఈ బ్యాంకులో ఐదుగురు సిబ్బందికిగాను ఇద్దరు కరోనా బారిన పడడంతో గత వారం బ్యాంకుకు ఒక రోజు సెలవు ప్రటించి శానిటేషన్‌ చేశారు. వారం గడవక ముందే మరొకరికి కరోనా సోకడంతో సోమవారం బ్యాంకు పూర్తిగా మూసి వేశారు. అలాగే స్టేట్‌ బ్యాంకు అధికారులు కొవిడ్‌ టీకా వేసుకోవడంతో జ్వరాల బారిన పడినట్టు సమాచారం. దీంతో ఆ బ్యాంకు కూడా తెరవలేదు. ఫలితంగా వినియోగదారులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Updated Date - 2021-05-11T04:26:54+05:30 IST