కొవిడ్‌ రోగులను పిండేస్తున్నారు!

ABN , First Publish Date - 2021-05-11T06:42:19+05:30 IST

కొవిడ్‌ బాధితులను ప్రైవేటు డాక్టర్లు పిండేస్తున్నారు. కొందరు వైద్యులు సిండికేట్‌గా మారి ఫీజులు భారీగా పెం చి దండుకుంటున్నారు.

కొవిడ్‌ రోగులను పిండేస్తున్నారు!
మిర్యాలగూడలోని కోణార్క్‌ ఆస్పత్రి ఫార్మసీలో తనిఖీలు చేస్తున్న టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది

 అధిక ఫీజులు వసూలుచేస్తున్న ప్రైవేటు వైద్యులు
 యథేచ్ఛగా రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల దందా
 ‘మిర్యాల’లో టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల విస్తృతదాడులు

మిర్యాలగూడ అర్బన, మే 10:
కొవిడ్‌ బాధితులను ప్రైవేటు డాక్టర్లు పిండేస్తున్నారు. కొందరు వైద్యులు సిండికేట్‌గా మారి ఫీజులు భారీగా పెం చి దండుకుంటున్నారు. జిల్లా వైద్యాధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్న నే పథ్యంలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కొరడా ఝలిపిస్తున్నా ఏ మాత్రం మార్పు కన్పించట్లేదు. ప్రధానంగా జిల్లాలోని మిర్యాలగూడ కేంద్రంగా వైద్య దోపిడీ జరుగుతోంది. దీని కట్టడికి ఆస్పత్రుల ఎదుట ఫీజుల వివరాల పట్టిక ప్రదర్శించాలని ఎస్పీ ఆదేశించినా పట్టించుకోవట్లేదు. రోగుల నుంచి అధిక ధర వసూలు చేస్తున్నట్లుగా వచ్చిన ఫిర్యాదులతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఇప్పటికే మూడు పర్యాయాలు జరిపిన దాడుల్లో వాస్తవాలు బహిర్గతమయ్యాయి. కొవిడ్‌ బారినపడ్డ రోగుల ఊపిరితిత్తులో ఇనఫెక్షన నియంత్రించేందుకు రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను వైద్యులు ఉపయోగిస్తారు. వీటి కొరత అధికంగా ఉందంటూ రోగుల బంధువులను వైద్యులు మరింతగా ఆందోళన చెందిస్తున్నారు. ఎలాగైనా తమవారిని బతికించాలంటూ ప్రాథేయపడేలా సీన క్రియేట్‌చేసి ఆస్పత్రి ఫార్మసీలో రహస్యంగా నిల్వచేసిన రెమ్‌డెసివిర్‌ను వైద్యులు అందిస్తున్నారు. ఇలాంటి సమయంలో కృత్రిమకొరత సృష్టించి ఒక్కో ఇంజక్షన ధరను నూరురెట్లు పెంచి రూ.30నుంచి రూ.35వేల వరకు వసూలు చేస్తున్నారు. సాధారణంగా ఈ ఇంజక్షన ధర రూ.3500 మాత్రమే.
డాక్టర్స్‌ కాలనీలో టాస్క్‌ఫోర్స్‌ దాడులు
మిర్యాలగూడ అర్బన / హుజూర్‌నగర్‌, కొవిడ్‌ వైద్యసేవలకు అధికఫీజులు వసూలుతో పాటు రోగులకు అవసరమైన మందులు, రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను ఎమ్మార్పీ ధరలకు మించి విక్రయిస్తున్నట్టు పలువురు బాధితులు పోలీస్‌ హెల్ప్‌లైనకు ఫిర్యాదుచేశారు. దీంతో పోలీస్‌ అధికారులు స్పందించి టాస్క్‌ఫోర్స్‌ సిబ్బందిని రంగంలోకి దింపారు. సోమవారం డాక్టర్స్‌కాలనీలోని పలు ప్రధాన ఆస్పత్రుల్లో విస్తృత తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా కోణార్క్‌ ఆస్పత్రికి సంబంధించిన మెడికల్‌షాపు, ల్యాబ్‌లో జరిపిన తనిఖీల్లో పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇదే ఆస్పత్రిలో ఆదివారం రాత్రి మృతిచెందిన కొవిడ్‌రోగికి రెండు రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు ఇచ్చి రూ.70వేలు వసూలు చేసినట్లు వచ్చిన ఫిర్యాదుమేరకు తనిఖీలు చేసి కేసు నమోదుచేసినట్లు తెలిపారు. దీంతోపాటు శాంత, పల్స్‌, బాలాజీ ఆస్పత్రుల్లో నూ తనిఖీలు చేశారు. వారం రోజుల వ్యవధిలో జరిగిన దాడుల్లో అంకిత, శ్రీసూర్యా నర్సింగ్‌హోంల నుంచి 62రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను పోలీసులు స్వాధీనం చేసుకొని ఆయా ఆస్పత్రులను సీజ్‌చేసి డాక్టర్లపై కేసు నమోదు చేశారు. పట్టణంలోని శ్రీసూర్యా ఆస్పత్రి వైద్యుడు,  సిబ్బందిని వనటౌన పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. హుజూర్‌నగర్‌లో పైరవీకారులకే కోవ్యాక్సిన లభిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి.
రెమ్‌డెసివర్‌ బ్లాక్‌మార్కెట్‌ దందాకు అడ్డుకట్ట
ఫ హెటెరో డ్రగ్స్‌ మేనేజర్‌, స్నేహితుడు అరెస్టు
నల్లగొండ క్రైం : రెమ్‌డెసివర్‌ ఇంజక్షన బ్లాక్‌మార్కెట్‌ దందా గుట్టును  జిల్లా పోలీసులు ఛేదించారు. ఎస్పీ రంగనాథ్‌ తెలిపిన వివరాల ప్రకారం మిర్యాలగూడలోని శ్రీసూర్య ఆసుపత్రిపై రెండు రోజుల క్రితం దాడులు చేసి భారీ సంఖ్యలో రెమ్‌డెసివర్‌ ఇంజిక్షన్లు సీజ్‌ చేసిన పోలీసులు ఎక్కడ నుం చి తీసుకొస్తున్నారనే కోణంలో విచారించారు. మిర్యాలగూడకు చెందిన బా లకృష్ణ హైదరాబాద్‌ హెటిరో డ్రగ్స్‌ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తుండగా; అతని చిన్ననాటి స్నేహితుడు, మిర్యాలగూడ పరిధిలోని శెట్టిపాలెంకు చెం దిన గణపతిరెడ్డి క్యూల్యాబ్‌ పేరుతో హైదరాబాద్‌లో వ్యాపారం నిర్వహిస్తున్నాడు. శ్రీలక్ష్మీ ఏజెన్సీస్‌ నుంచి బాలకృష్ణ ఒక్కో బాటిల్‌కు రూ.8వేల చొప్పు న చెల్లించి కొనుగోలు చేసి గణపతిరెడ్డి ద్వారా మిర్యాలగూడకు చెందిన శ్రీ సూర్య ఆస్పత్రి డాక్టర్‌ అశోక్‌కుమార్‌కు ఒక్కో బాటిల్‌ రూ.23వేల చొప్పున విక్రయించాడు. శ్రీసూర్య ఆస్పత్రి పీఆర్వో శ్రీనివాస్‌ వీటిని హైదరాబాద్‌ నుంచి తీసుకొచ్చి కరోనా చికిత్సకు వచ్చే రోగుల ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా ఒక్కో బాటిల్‌ రూ.35వేల నుంచి రూ.50వేల వరకూ విక్రయించారు. ఈ కేసులో రెండు రోజుల క్రితం డాక్టర్‌ అశోక్‌కుమార్‌తో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా సోమవారం హెటిరో డ్రగ్స్‌ మేనేజర్‌ బాలకృష్ణ, అతని స్నేహితుడు గణపతిరెడ్డిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఎస్పీ తెలిపారు. కేసు ఛేదనలో సమర్థంగా పనిచేసిన పనిచేసిన డీఎస్పీ వెంకటేశ్వరరావు, టాస్క్‌ఫోర్సు సీఐలు బాషా, బాలగోపాల్‌, తదితరులను ఎస్పీ అభినందించారు. 
గ్రీనలాండ్‌ ఆసుపత్రిపై కేసు నమోదు
నల్లగొండ క్రైం, మే 10 : కోవిడ్‌ చికిత్సలకు సంబంధించి అధిక మొత్తం లో ఛార్జీలు వసూలు చేస్తున్న పట్టణంలోని గ్రీనలాండ్స్‌ ఆఽధ్య కేర్‌ ఆస్పత్రిపై కేసు నమోదు చేసినట్లు నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. ప్రజల నుంచి అధికంగా వచ్చిన ఫిర్యాదుల మేరకు   ఎస్పీ రంగనాథ్‌ ఆదేశాల మేరకు నల్లగొండ టూటౌన సీఐ చంద్రశేఖ ర్‌రెడ్డి, ఎస్‌ఐ దోరెపల్లి నర్సింహులు నల్లగొండ పట్టణంలోని బస్టాండ్‌ సమీపంలోని ఆస్పత్రిపై సోమవారం తనిఖీల్లో రికార్డులు పరిశీలించడ ంతో పాటు రోగుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తున్నట్లు నిర్థార ణతో ఆసుపత్రిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆసుపత్రి ని ర్వాహకులు శివకాంతరెడ్డి, డాక్టర్‌ రాహుల్‌ అధికంగా ఫీజులు తీసుకో వడంతో పాటు రికార్డులను సక్రమంగా ని ర్వహించడం లేదన్నారు. బాధితుడు తాడిశెట్టి రమేష్‌ తన తల్లి భార తమ్మకు కరోనా సోకడ ంతో ఈనెల 3న చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిక చేయగా రకరకాల పరీక్షల పేరుతో డబ్బులు వసూలు చేసినట్టు బాధితులు ఫిర్యాదు చేయగా ఈనెల 8న డిశ్చార్జి చేయగా ఆరు రోజుల చికిత్సకు రూ.1.80 లక్షలు వసూలు చేసినట్లు ఫిర్యాదు చేశారన్నారు. బాధితుని ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు

Updated Date - 2021-05-11T06:42:19+05:30 IST