మూడు విధాలుగా కొవిడ్‌ చికిత్స

ABN , First Publish Date - 2021-05-06T04:42:23+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ బాధితులకు మూడు విధాలుగా చికిత్స అందిస్తున్నామని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ తెలిపారు. బుధవారం వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఏఎన్‌ఎంలకు కొవిడ్‌ కిట్లు అందజేశారు.

మూడు విధాలుగా కొవిడ్‌ చికిత్స
విజయనగరం రింగురోడ్డు : విలేఖరులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌

కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ 

విజయనగరం రింగురోడ్డు : జిల్లాలో కొవిడ్‌ బాధితులకు మూడు విధాలుగా చికిత్స అందిస్తున్నామని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ తెలిపారు. బుధవారం వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఏఎన్‌ఎంలకు కొవిడ్‌ కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి, కరోనా బాధితులు, ఆక్సిజన్‌ పరిమాణం తక్కువగా ఉన్నవారికి, ఆరోగ్యం క్షీణించే వారికి ఆసుపత్రుల్లో వేర్వేరుగా చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. ఇందుకు గాను 14 ప్రభుత్వ, 16 ప్రైవేట్‌ ఆసు పత్రులు సిద్ధం చేశామని తెలిపారు.  ప్రస్తుతం 997మంది బాధితులు ఆసు పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారన్నారు. వ్యాధి లక్షణాలు స్వల్పంగా ఉన్నా, హోంఐసోలేషన్‌లో ఉండేందుకు వీలు లేనివారి కోసం  జిల్లాలో ఏడు కరోనా కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. వీటిల్లో 3,600 పడకలు ఉన్నాయని, 24 గంటలూ వైద్యులు పర్యవేక్షిస్తారని తెలిపారు. అవ సరమైతే వినియోగించేందుకు ఆక్సిజన్‌, మందులు, అంబులెన్స్‌లు సిద్ధం చేశామని చెప్పారు.  కార్యక్రమంలో వైద్యాధికారులు  రమణకుమారి, చామంతి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


కర్ఫ్యూ నిబంధనలపై అవగాహన : సబ్‌ కలెక్టర్‌

సీతానగరం(బొబ్బిలి) : కొవిడ్‌ కర్ఫ్యూ నిబంధనలపై పట్టణ పరిధిలో వ్యాపారులకు బుధవారం సబ్‌ కలెక్టర్‌ విధేఖర్‌ అవగాహన కల్పించారు. స్థానిక మునిసిపల్‌ కార్యాలయంలో చైర్మన్‌ మురళి, అధికారుల సమక్షంలో  కూరగాయల, చేపల మార్కెట్‌ వ్యాపారులతో చర్చించారు. పట్టణంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజారోగ్యం దృష్టిలో పెట్టుకుని మార్కెట్‌ను రాజా కాలేజ్‌ గ్రౌండ్‌, సీబీఎం స్కూల్‌లోకి మార్చినట్లు ఆయన తెలిపారు.  ప్రజలం దరూ ఉదయం 6 గంటలనుంచి మధ్యాహ్నం 12 గంటలలోపు నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకోవాలని సూచించారు. మాస్కు  ధరించాలని,  భౌతి కదూరం పాటించాలని తెలిపారు. సమావేశంలో కమిషనర్‌ ఎంఎంనాయుడు, ఇన్‌చార్జి తహసీల్దార్‌ సాయికృష్ణ, సివిల్‌ సప్లయిస్‌ డీటీ శంకరరావు, ఎస్‌ఐ ప్రసాద్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-06T04:42:23+05:30 IST