కొవిడ్‌ వ్యాక్సినేషన విజయవంతం

ABN , First Publish Date - 2021-01-17T05:53:08+05:30 IST

కొవిడ్‌ వ్యాక్సినేషన విజయవంతమైంది. శనివారం ఆయా ఆస్పత్రుల్లో తొలి విడతగా ఫ్రంట్‌లైన వారియర్స్‌కు వ్యాక్సిన వేశారు. రాయదుర్గం సీహెచసీ కేంద్రంలో ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి కొవిడ్‌ వ్యాక్సినేషన ప్రక్రియను ప్రారంభించి మాట్లాడారు.

కొవిడ్‌ వ్యాక్సినేషన విజయవంతం
రాయదుర్గంలో వ్యాక్సినేషనను పరిశీలిస్తున్న ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి

రాయదుర్గం, జనవరి 16: కొవిడ్‌ వ్యాక్సినేషన విజయవంతమైంది. శనివారం ఆయా ఆస్పత్రుల్లో తొలి విడతగా ఫ్రంట్‌లైన వారియర్స్‌కు వ్యాక్సిన వేశారు. రాయదుర్గం సీహెచసీ కేంద్రంలో ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి కొవిడ్‌ వ్యాక్సినేషన ప్రక్రియను ప్రారంభించి మాట్లాడారు. కొవిడ్‌ రహిత సమాజం కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. కాగా ఉదయం సర్వర్‌ మొరాయించడంతో మధ్యాహ్నం 1.30 గంటల వరకు వ్యాక్సినేషన ప్రక్రియను నిలిపివేశారు. అనంతరం సర్వర్‌ పనిచేయడంతో తొలుత వేసిన ఐదుగురి పేర్లను నమోదు చేసి మిగిలిన వారికి వ్యాక్సిన వేశారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచవో రమేష్‌ నాయక్‌, వైద్యాధికారులు సత్యనారాయణ, సందేష్‌, రమేష్‌, తహసీల్దార్‌ సుబ్రహ్మణ్యం, సీఐ ఈరణ్ణ తదితరులు పాల్గొన్నారు.


కళ్యాణదుర్గం : మండలంలోని ముద్దినాయనపల్లి ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలో శనివారం ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్‌ కొవిడ్‌-19 వ్యాక్సినేషన కార్యక్ర మాన్ని ప్రారంభించారు. ఆర్డీఓ రామారావు, డాక్టర్‌ రాఘవేంద్రలతో కలిసి ఆరోగ్య కార్యకర్తలకు టీకాలు వేశారు. అనంతరం డీఎంహెచఓ కామేశ్వరప్రసాద్‌ ఈఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. టీకా నిర్వహణపై డాక్టర్లతో చర్చించారు. తొలిరోజు 88 మందికి టీకాలు వేశామని డాక్టర్‌ రాజేంద్ర తెలిపారు. వివిధ కారణాలతో 12 మందికి టీకాలు వేయలేకపోయామన్నారు.


పామిడి : కొవిడ్‌ వ్యాక్సినేషనపై ఎలాంటి సందేహాలు వద్దని ఏడీసీసీ బ్యాంకు చైర్మన వీరాంజనేయులు అన్నారు. మండలంలోని ఎద్దులపల్లి   ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం కొవిడ్‌ వ్యాక్సినేషనను తహసీల్దార్‌ చిన్నన్న, సీఐ శ్యామరావు, సీహెచసీ వైద్యాధికారి డాక్టర్‌ ఎల్లప్ప, పీహెచసీ వైద్యాధికారి డాక్టర్‌ రోహినాథ్‌, వైసీపీ నాయకులతో కలిసి ఆయన ప్రారం భించారు. తొలిరోజు 90మంది వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బందికి వ్యాక్సిన వేసినట్లు వైద్యాధికారి రోహినాథ్‌ తెలిపారు. జాయింట్‌ కలెక్టర్‌ సిరి వ్యాక్సినేషనను పరిశీలించారు. వ్యాక్సినేషన పట్ల అపోహలు వద్దని, ఎప్పటికప్పుడు అ ప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో హెల్త్‌ సూపర్‌వైజర్లు కృష్ణమోహన, శ్రీరామిరెడ్డి, ధర్మేంద్రసింగ్‌, ఏఎనఎంలు, ఆశావర్కర్లు పాల్గొన్నారు. 


శెట్టూరు: స్థానిక ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో శనివారం కొవిడ్‌ వ్యాక్సినేషనను ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్‌ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా విపత్తులో ఆరోగ్య సిబ్బంది, పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివన్నారు. అనంతరం 80 మంది  ఆరో గ్య సిబ్బందికి వ్యాక్సిన వేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ రామ్మోహన, తహసీల్దార్‌ శంకరయ్య, వైద్యాధికారి రంగవేణి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. 


ఉరవకొండ : స్థానిక సీహెచసీ ఆసుపత్రిలో కొవిడ్‌ వ్యాక్సినేషన కార్యక్రమాన్ని శనివారం సూపరింటెండెంట్‌ సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి ప్రారంభించారు. 580 మంది ఫ్రంట్‌లైన వారియర్స్‌ ఆనలైనలో పేర్లు నమోదు చేసుకున్నారని, ఐదు రోజుల్లో వీరికి వ్యాక్సిన వేసేందుకు చ ర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో తహసీల్దారు మునివేలు, వైద్యులు ఎర్రిస్వామి రెడ్డి పాల్గొన్నారు.


కణేకల్లు : మండలంలోని యర్రగుంట పీహెచసీ కేంద్రంలో వైద్యులతో పాటు ఏఎనఎంలు, ఆశా వర్కర్లు 35 మందికి శనివారం కరోనా వ్యాక్సిన వేసినట్లు వైద్యాధికారి విజయ్‌కుమార్‌ నాయక్‌ తెలిపారు. కార్యక్రమాన్ని తహసీల్దార్‌ ఉషారాణి, ఎస్‌ఐ సురేష్‌, ఈవోఆర్డీ గూడెన్న ప్రారంభించారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్‌ శివప్రసాద్‌, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. కాగా సాంకేతిక కారణాలతో వ్యాక్సినేషన కార్యక్రమాన్ని మధ్యాహ్నం తరువాత ప్రారంభించాల్సి వచ్చింది. 


యాడికి: కరోనా వ్యాక్సినపై అపోహలు వీడాలని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. శనివారం స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో కరోనా వ్యాక్సినేషన సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం ప్రధానమంత్రి సందేశాన్ని వీక్షించారు. మొదటిరోజు వందమంది ఆరోగ్యసిబ్బంది వ్యాక్సినేషనకు నమో దు చేసుకోగా, 78 మందికి వ్యాక్సిన ఇచ్చామని డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్‌ సిరిచందన, ఎంపీహెచఓలు శ్రీనివాసులు, మోహన, ఆరోగ్యసిబ్బంది పాల్గొన్నారు.


పెద్దవడుగూరు: స్థానిక ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో శనివారం కరోనా వ్యాక్సినేషనను ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రారంభించారు. మొదటి విడతలో ఆరోగ్య, అంగనవాడీ సిబ్బంది 69 మంది దరఖాస్తు చేసుకోగా, 37 మందికి వ్యాక్సిన వేశారు. 


గుత్తి : పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం కొవిడ్‌ వ్యాక్సినేషన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వై వెంకటరామిరెడ్డి ప్రారంభించారు. ఎంఎనఓ నరసింహులుకు మొదటి టీకా వేశారు. రూరల్‌, అర్బన పరిధిలో 320 మంది వైద్య సిబ్బంది పేర్లను నమోదు చేసుకోగా, తొలిరోజు 98 మందికి వ్యాక్సిన అందజేస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్‌ డీ ఎంహెచఓ రామసుబ్బారావు, సూపరింటెండెంట్‌ హనీఫ్‌, వైద్యుడు ప్రశాంతవర్ధన, మహేష్‌ నాయుడు, సందీప్‌ యాదవ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ గంగిరెడ్డి, తహసీల్దారు హాజీవలి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.


వజ్రకరూరు: స్థానిక పీహెచసీలో శనివారం కొవిడ్‌ వ్యాక్సినేషనను ప్రా రంభించారు. మొదటి టీకాను వైద్యాధికారిణి జ్యోతిర్మయి వేయించుకున్నా రు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యాక్సిన కోసం 70 మంది రిజిష్టర్‌ చేయించుకోగా, అందరికీ వ్యాక్సిన వేశామన్నారు. రెండవ విడతలో పోలీసులు, పారిశుధ్య కార్మికులకు, మూడో విడతలో 50 సంవత్సరాలు పైబడిన వారికి వ్యాక్సిన వేస్తామన్నారు. సాయంత్రం జాయింట్‌ కలెక్టర్‌ సిరి, డీఎంహెచఓ కామేశ్వర ప్రసాద్‌ సందర్శించి వ్యాక్సినేషన వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వైద్యాధికారి మహేష్‌ కుమార్‌ పాల్గొన్నారు.




Updated Date - 2021-01-17T05:53:08+05:30 IST