కొవిడ్‌ బాధితులు అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-05-09T04:30:44+05:30 IST

లక్షణాలు ఉన్న వారు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అసంక్రమిత వ్యాధుల ప్రోగ్రాం అధికారి కల్యాణ చక్రవర్తి శనివారం అన్నారు.

కొవిడ్‌ బాధితులు అప్రమత్తంగా ఉండాలి
మఠంపల్లిలో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్న వైద్య ఆరోగ్య సిబ్బంది

అనంతగిరి / హుజూర్‌నగర్‌ /  కోదాడ టౌన / మఠంపల్లి / మునగాల / చివ్వెంల, మే 8 : కరోనా లక్షణాలు ఉన్న వారు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అసంక్రమిత వ్యాధుల ప్రోగ్రాం అధికారి కల్యాణ చక్రవర్తి శనివారం అన్నారు. మండలంలో జరుగుతున్న ఇంటింటి సర్వేను ఆయన శనివారం పరిశీలించారు. అనుమానిత లక్షణాలు ఉన్న వారికి ఐసోలేషన్‌ కిట్లు అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా సర్వేను పర్యవేక్షిస్తూ, సమీక్షిస్తున్నట్లు ఎంపీడీవో శ్రీనివాస్‌, డాక్టర్‌ లక్ష్మి ప్రసన్న తెలిపారు. కార్యక్రమంలో వెంకమ్మ, కళావతి, రత్నమేరి , శైలజ, ఆరోగ్య, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. హుజూర్‌నగర్‌లోని శ్రీనివాసపురం సర్పంచ్‌ పత్తిపాటి రమ్యనాగరాజు ఇంటింటి సర్వేలో పాల్గొన్నారు. ఆమెవెంట గురవయ్య, మంజుల, పార్వతి, అలివేలుమంగ పాల్గొన్నారు. కోదాడ పట్టణంలోని బాలాజీనగర్‌లో సర్వేను తహసీల్దార్‌  శ్రీనివాసశర్మ పరిశీలించారు. ఆయన వెంట వీఆర్వో జానీపాష, ఆర్‌పీ పర్విన, రమేష్‌ పాల్గొన్నారు.  మఠంపల్లి మండలంలోని పలు గ్రామాల్లో తహసీల్దార్‌ లక్ష్మణ్‌బాబు పర్యటించి, సర్వే సరళిని పరిశీలించారు ఆయన వెంట ఆర్‌ఐ సీతరామయ్య, డాక్టర్‌ ఫిరోజ్‌ తదితరులు పాల్గొన్నారు. మునగాల, చివ్వెంల మండలాల్లోని గ్రామాల్లో వైద్యబృందాలు ఇంటింటి సర్వే నిర్వహించాయి.  


కొనసాగుతున్న లాక్‌డౌన

నడిగూడెం: కరోనా నివారణ చర్యలో భాగంగా నడిగూడెం, రామా పురంలో స్వచ్ఛంద లాక్‌డౌన శనివారం కొనసాగింది. ఆయా గ్రామా ల్లోని ప్రజలు ఇబ్బందులు పడకుండా అన్నివీధుల్లో బీచింగ్‌ పౌడర్‌ చల్లడం, మురుగుకాల్వలు శుభ్రం చేయడం పనులు చేపట్టారు. సర్పం చులు గడ్డం నాగలక్ష్మీ మల్లేష్‌యాదవ్‌, గుజ్జఅనసూరమ్మ, పాలకవర్గం సభ్యులు అధికారుల సహకారంతో లాక్‌డౌనను కొనసాగిస్తున్నారు. 


రేపటి నుంచి నేరేడుచర్లలోనూ..

నేరేడుచర్ల : కరోనా తీవ్రరూపం దాల్చుతుండడంతో ఈ నెల 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే కిరాణా, సూపర్‌మార్కెట్లు తెరిచి ఉంచుతామని కిరాణా మర్చంట్స్‌ అసోషియేషన్‌ నేరేడుచర్ల అధ్యక్షుడు రాచకొండ రాంమోహన్‌రావు తెలిపారు. అసోషియేషన్‌ సభ్యులు శనివారం చర్చించుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ పాక్షిక లాక్‌డౌన్‌ కొనసాగుతుందని తెలిపారు. పాక్షిక లాక్‌డౌన్‌ విధిస్తున్నందున ప్రజలు సహకరించాలని కోరారు. ఆటోమోబైల్‌ షాపులు కూడా మధ్యాహ్నం 12 గంటల నుంచి మూసివేయనున్నట్లు సంఘం అధ్యక్షుడు రాగిరెడ్డి గోపాల్‌రెడ్డి తెలిపారు. 


కరోనా బాధితులకు  భోజనం పంపిణీ 

సూర్యాపేటటౌన్‌: జిల్లా కేంద్రంలోని 27 వార్డులో కరోనా వైరస్‌ బారిన పడినవారికి ఎస్‌ఎన్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో శనివారం భోజనం ప్యాకెట్లు అందజేశారు. కరోనాతో ఇబ్బందులుపడుతున్న వారికి సహాయం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఫౌండేషన్‌ సభ్యులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-09T04:30:44+05:30 IST