కోజికోడ్ విమానాశ్రయం మూసివేత

ABN , First Publish Date - 2020-08-08T16:06:32+05:30 IST

కోజికోడ్ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటన అనంతరం విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.....

కోజికోడ్ విమానాశ్రయం మూసివేత

కోజికోడ్ (కేరళ): కోజికోడ్ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటన అనంతరం విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. కోజికోడ్ విమానాశ్రయం రన్ వేపై జరిగిన ప్రమాదంతో విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖ శనివారం ప్రకటించింది. కోజికోడ్ కు వచ్చే విమాన సర్వీసులను కన్నూర్, కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయాలకు మళ్లించారు. విమాన పైలెట్ కెప్టెన్ దీపక్ సాథీ, కో పైలెట్ అఖిలేష్ కుమార్ లు మరణించడంతో ఎయిర్ ఇండియా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపింది.  కోజికోడ్ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన ప్రమాద ఘటనపై పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రమాద దర్యాప్తు విభాగం ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో సమగ్ర దర్యాప్తు సాగిస్తోంది.

Updated Date - 2020-08-08T16:06:32+05:30 IST