సరిగ్గా పదేళ్ల క్రితం నాటి సేమ్ సీన్ మ‌ళ్లీ రీపిట్ !

ABN , First Publish Date - 2020-08-08T13:39:54+05:30 IST

సరిగ్గా పదేళ్ల క్రితం మంగళూరు విమానాశ్రయంలో జరిగిన విమాన ప్రమాదం గుర్తుందా? ఇప్పుడు కోజికోడ్‌లో జరిగింది ఇలాంటి ప్రమాదమే. అక్కడా.. ఇక్కడా కూడా టేబుల్‌టాప్‌ రన్‌వేనే. బోయింగ్‌ 737 రకానికి చెందిన విమానాలే.

సరిగ్గా పదేళ్ల క్రితం నాటి సేమ్ సీన్ మ‌ళ్లీ రీపిట్ !

మంగళూరు ప్రమాదంతో పోలికలు

రెండూ కొండమీది ఎయిర్‌పోర్టులే 

రెండూ ఎయిరిండియా విమానాలే

రెండూ బోయింగ్‌ 737 ఫ్లైట్లే

రెండూ వచ్చింది దుబాయ్‌ నుంచే

సరిగ్గా పదేళ్ల క్రితం మంగళూరు విమానాశ్రయంలో జరిగిన విమాన ప్రమాదం గుర్తుందా? ఇప్పుడు కోజికోడ్‌లో జరిగింది ఇలాంటి ప్రమాదమే. అక్కడా.. ఇక్కడా కూడా టేబుల్‌టాప్‌ రన్‌వేనే. బోయింగ్‌ 737 రకానికి చెందిన విమానాలే. 2010 మే 22న దుబాయ్‌ నుంచి వచ్చిన ఎయిర్‌ ఎక్స్‌ప్రెస్‌ విమానం(నెం.812) ఉదయం 6గంటల ప్రాంతంలో మంగళూరు విమానాశ్రయంలో దిగడానికి ప్రయత్నిస్తోంది. అప్పటికే విమానాన్ని దించాలా వద్దా అనే సందిగ్ధంలో పైలట్‌ ఉన్నారు. ‘దిగొద్దు.. వెనక్కు వెళ్దాం’ అని అప్పటికే కో-పైలట్‌ మూడు సార్లు పైలట్‌కు చెప్పారు. అంతటిలోనే విమానం రన్‌వేను దాటి కొండవారగా పడిపోవడం.. మంటల్లో చిక్కుకోవడం జరిగిపోయాయి. పైలట్‌, కోపైలట్‌, ఇతర సిబ్బంది సహా 158మంది ఆగ్నికి ఆహుతయ్యారు.  కేవలం 8మంది బతికి బయటపడ్డారు. ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ చరిత్రలో ఇదే మొదటి ప్రాణాంతకర ప్రమాదం. అయితే, అప్పట్లో ఇప్పుడున్నట్లు విపత్కర వాతావరణ పరిస్థితులు లేవు. వాతావరణమంతా అనుకూలంగానే ఉంది. విమానాన్ని దించడంలో పైలట్‌ చేసిన తప్పిదమే అంతటి ఘోరానికి కారణమని చివరికి తేలింది. 


ఏమిటీ టేబుల్‌ టాప్‌ రన్‌వే?

టేబుల్‌టాప్‌.. పేరుకి తగ్గట్లే.. టేబుల్‌ ఉపరితలం మాదిరిగానే ఈ రన్‌వేలు ఉంటాయి. కొండ లేదా ఎత్తైన ప్రదేశంలో చదునుగా ఉండే చోట ఈ రన్‌వేను నిర్మిస్తారు. అందువల్ల ఈ రన్‌వేలకు ఇరువైపులా, ముందూ వెనుకా కొండలు.. లోయలు ఉంటాయి. సాధారణ విమానాశ్రయాల్లోని రన్‌వేల కంటే వీటి నిడివి కూడా చిన్నదిగా ఉంటుంది. అత్యంత నైపుణ్యం కలిగిన పైలట్లకు కూడా దృష్టిభ్రాంతిని, అయోమయాన్ని కలిగిస్తాయి. పైలట్లు వెంట్రుకవాసి తప్పిదం చేసినా విమానానికి ఘోర ప్రమాదం తప్పదు.


దేశంలో మూడే..

టేబుల్‌టాప్‌ రన్‌వేలు మన దేశంలో ఉన్నావి మూడే. కర్నాటకలోని మంగళూరు, కేరళలోని కోజికోడ్‌, మిజోరాంలోని లెంగ్‌ప్యూ విమానాశ్రయాల్లోనే టేబుల్‌టాప్‌ రన్‌వేలు ఉన్నాయి. 


షార్ట్‌ ఫీల్డ్‌ ఫెర్ఫార్మెన్స్‌ విమానాలే..

టేబుల్‌టాప్‌ విమానాశ్రయాల్లో దిగడానికి అన్ని రకాల విమానాలూ అనుకూలం కూదు. షార్ట్‌ ఫీల్డ్‌ ఫెర్ఫార్మెన్స్‌(ఎ్‌సఎ్‌ఫపీ) సాంకేతికత ఉన్న విమానాలే టేబుల్‌టా్‌పపై దిగగలవు. పైలట్‌ కూడా ఈ రన్‌వేకు తగినట్లే విమానాన్ని దించాల్సి ఉంటుంది. సాధారణ రన్‌వేలపై దించినట్లుగానే టేబుల్‌టా్‌పపై దించాలని పైలట్‌ ప్రత్నించడం కూడా మంగళూరు విమాన ప్రమాదానికి కారణాల్లో ఒకటి కావడం గమనార్హం. ఈ ఇబ్బందులు వల్లనే పలు పౌర విమానయాన సంస్థలు బోయింగ్‌ 737, ఎయిర్‌బర్‌ ఏ330 వంటి విమానాలను టేబుల్‌టాప్‌ రన్‌వేలు ఉన్న విమానాశ్రయాలకు పంపడం మానుకున్నాయి.


Updated Date - 2020-08-08T13:39:54+05:30 IST