ఆగస్టు 15న 75వేల మందితో జాతీయ జెండాలతో పరేడ్‌

ABN , First Publish Date - 2022-06-28T16:52:56+05:30 IST

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆగస్టు 15న 75వేల మందితో జాతీయ పతాకాలతో పరేడ్‌ నిర్వహిస్తామని కేపీసీసీ

ఆగస్టు 15న 75వేల మందితో జాతీయ జెండాలతో పరేడ్‌

                             - Kpcc President Shivakumar


బెంగళూరు, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆగస్టు 15న 75వేల మందితో జాతీయ పతాకాలతో పరేడ్‌ నిర్వహిస్తామని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ప్రకటించారు. సోమవారం బీదర్‌లో నవసంకల్ప్‌ శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బెంగళూరుకు అనుబంధంగా ఉండే తుమకూరు, రామనగర, చిక్కబళ్లాపుర, కోలారు, బెంగళూరు గ్రామీణ జిల్లాల నుంచి 3వేల మంది చొప్పున పాల్గొంటారని, రాష్ట్రంలోని మిగిలిన నియోజకవర్గాల నుంచి 300-400 మంది దాకా భాగస్వామ్యులవుతారన్నారు. బెంగళూరులో జరిగే ఈ ర్యాలీ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలకు మరో 270 రోజులు మాత్రమే గడువు ఉందని, మూడు నెలల ముందే నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉన్నందున ఎన్నికలకు మరో 180 రోజులు మా త్రమే మిగిలినట్టుగా భావించాలని ప్రతి కార్యకర్త ప్రజలకు అందుబాటులో ఉండి పార్టీకోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.

Updated Date - 2022-06-28T16:52:56+05:30 IST