Sonia and Priyanka: రాష్ట్రంలో ‘భారత్‌ జోడో’ యాత్రకు.. సోనియా, ప్రియాంక రాక

ABN , First Publish Date - 2022-09-24T17:07:27+05:30 IST

కాంగ్రెస్‌ ముఖ్యనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర రాష్ట్రంలో పర్యటించేవేళ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, ప్రియాంకగాంధీ

Sonia and Priyanka: రాష్ట్రంలో ‘భారత్‌ జోడో’ యాత్రకు.. సోనియా, ప్రియాంక రాక

- కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌  

- ఏర్పాట్లపై ముఖ్యనేతలతో సమీక్ష


బెంగళూరు, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ముఖ్యనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర రాష్ట్రంలో పర్యటించేవేళ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, ప్రియాంకగాంధీ పాల్గొంటార కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ వెల్లడించారు. రాష్ట్రంలో యాత్ర ఏర్పాట్లపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి రణదీప్‏సింగ్‌ సుర్జేవాలా, ప్రతిపక్షనేత సిద్దరామయ్య, నేతలు వీరప్పమొయిలీ, ఎంబీ పాటిల్‌ సహా ముఖ్యనేతలందరూ పాల్గొన్నారు. యాత్ర(Yatra) ఏర్పాట్లపై జరిగిన సమీక్ష వివరాలను డీకే శివకుమార్‌ మీడియాకు తెలిపారు. ఈనెల 30న చామరాజనగర జిల్లా గుండ్లుపేటలోకి రాహుల్‌ పాదయాత్ర ప్రవేశిస్తుందన్నారు. అక్టోబరు 2న బదనవాళు గ్రామంలో గాంధీజయంతి ఏర్పాటు చేశామన్నారు. దసరా పండుగ సందర్భంగా రెండు రోజులుపాదయాత్రకు విరామం ఉంటుందన్నారు. బళ్లారిలో బహిరంగసభ ఏర్పాటు చేశామన్నారు. రాహుల్‌గాంధీ ప్రతిరోజూ యువత, మహిళలు, విద్యార్థులు, రైతులు, ఆదివాసీలతోపాటు అన్నివర్గాలకు చెందినవారితో చర్చాగోష్టి జరుపుతారని వివరించారు. బ్లాక్‌కాంగ్రెస్‌ అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్‌ సమితి, పార్టీ అన్ని కమిటీలు, గత ఎన్నికల్లో ఓటమి చెందిన అభ్యర్థులు రాహుల్‌గాంధీ వెంట నడిచేలా ప్రణాళికలు చేశామన్నారు. కళాకారులు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖులతోపాటు విమర్శకులు రాహుల్‌యాత్రలో పాల్గొంటారన్నారు. మైసూరులో ఉదయం 7 గంటలకే రాహుల్‌పాదయాత్ర ప్రారంభిస్తారన్నారు. యాత్ర ఏర్పాట్లపై సంతృప్తి కలిగిందని కేసీ వేణుగోపాల్‌ వెల్లడించారు. కన్యాకుమారిలో ప్రారంభమైన యాత్ర తమిళనాడు, కేరళలో ప్రజాదరణ పొందిందన్నారు. కర్ణాటకలో అంతకుమించి ప్రజలు మద్దతు ఇస్తారని భావిస్తున్నామన్నారు. రాహుల్‌గాంధీ రోజుకు 25 కిలోమీటర్లు నడక సాగిస్తున్నారన్నారు. 

Updated Date - 2022-09-24T17:07:27+05:30 IST