Bharat Jodo Padayatra: రాష్ట్రంలో 510 కిలోమీటర్లు రాహుల్‌ పాదయాత్ర

ABN , First Publish Date - 2022-09-13T17:39:23+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ తలపెట్టిన భారత్‌ జోడో పాదయాత్ర(Bharat Jodo Padayatra)ను విజయవంతం చేసేందుకు నాయకు

Bharat Jodo Padayatra: రాష్ట్రంలో 510 కిలోమీటర్లు రాహుల్‌ పాదయాత్ర

- భారత్‌ జోడోను విజయవంతం చేయాలి

- కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ 

- అక్టోబరు 16న కేపీసీసీ అధ్యక్ష ఎన్నిక


రాయచూరు(బెంగళూరు), సెప్టెంబరు 12 : కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ తలపెట్టిన భారత్‌ జోడో పాదయాత్ర(Bharat Jodo Padayatra)ను విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సన్నద్ధం కావాలని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ పిలుపునిచ్చారు. జిల్లాలో భారత్‌ జోడో పాదయాత్ర ఏర్పాట్లకు సంబంధించి సోమవారం స్థానిక నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 510 కిలో మీటర్లమేర పాదయాత్ర సాగనుందని తెలిపారు. పాదయాత్రలో భాగంగా రాహుల్‌ గాంధీ అక్టోబర్‌ 22,23 తేదీల్లో రాయచూరు జిల్లాలోనే బస చేస్తారని పేర్కొన్నారు. పాదయాత్ర సందర్భంగా రాహుల్‌ గాంధీ పాత మైసూరు ప్రాంతంతో పాటు రాయచూరు జిల్లాలో నేరుగా రైతులు, వివిధ వర్గాల ప్రజలతో ముఖా-ముఖి మాట్లాడే కార్యక్రమం నిర్వహిస్తున్నట్తు వివరించారు. జిల్లాలో లింగసుగూరు వైపు నుంచి ప్రారంభమైయ్యే పాదయా త్ర శక్తినగర్‌ మీదుగా తెలంగాణలోకి ప్రవేశిస్తుందన్నారు. రాయచూరు(Raichur) జిల్లాలో పాదయాత్రను విజయవం తం చేసేందుకు దీన్ని స్థానిక నాయకులు ఒక అవకాశంగా తీసుకోవాలన్నారు. రాయచూరుతో పాటు కొప్పళ, యాదగిరి, కలబుర్గి జిల్లాలకు చెందిన అగ్ర నాయకులందరు యాత్రకు తరలి రావాలని, అ దే సమయంలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీకి చెందిన ఇతర ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ప్రజలను తరలించి పాదయాత్ర విజయవంతమయ్యేలా కృషి చేయాలని పిలుపునిచ్చా రు. కర్ణాటక ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్ష పదవి కోసం అక్టోబర్‌ 16వ తేదీన బెంగళూరు అంబేడ్కర్‌ భవన్‌లో ఎన్నిక ఉంటుందన్నారు. తాను కేపీసీసీ అధ్యక్షుడిగా పోటీ చేసే విషయం గురించి ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, పార్టీ అదిష్టానం సూచనలు, రాష్ట్ర నాయకుల సలహా మేరకు అప్పటికి నిర్ణయం తీసుకుంటామన్నారు. పార్టీ నిబంధనలకు అనుగుణంగా ఎన్నికలు ఉంటాయన్నారు. అదే సమయంలో ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ పోటీ చేస్తారా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ తన వద్ద ఎలాంటి సమాచారమేమి లేదని స్పష్టం చేశారు. 

Updated Date - 2022-09-13T17:39:23+05:30 IST