మాస్ మహారాజా రవితేజ హీరోగా డైరెక్టర్ గోపీచంద్ మలినేని రూపొందిస్తున్న చిత్రం `క్రాక్`. శ్రుతీ హాసన్ కథానాయిక. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తయింది. ఒక పాట చిత్రీకరణ మాత్రమే మిగిలింది. శుక్రవారం నుంచి ఈ పాట చిత్రీకరణ మొదలు కాబోతోంది. రవితేజ, శ్రుతి హాసన్లపై ఈ పాటను చిత్రీకరించనున్నారు. రాజు సుందరం కొరియోగ్రఫీ సమకూరుస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన స్పెషల్ సాంగ్ `భూమ్ బద్దల్` మంచి ఆదరణ సంపాదించుకుంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.