విరిగిన తలుపులు, పగిలిన కిటికీ అద్దాలు

Published: Sun, 27 Mar 2022 01:11:46 ISTfb-iconwhatsapp-icontwitter-icon
విరిగిన తలుపులు, పగిలిన కిటికీ అద్దాలువిరిగిపోయి పడి ఉన్న తలుపును చూపిస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు

చెత్తాచెదారం, తుప్పలతో నిండిన పరిసరాలు

టీడీపీ బృందం పరిశీలనలో దర్శనమిచ్చిన టిడ్కో గృహాల సముదాయం

ఉగాది నాటికి లబ్ధిదారులకు ఇలాగేనా ఇచ్చేది అంటూ ఆ పార్టీ నేతల మండిపాటు

దవళేశ్వరం, మార్చి 26: పేదల సొంతింటి కల నెరవేర్చాలనే ధ్యేయంతో టీడీపీ హయాంలో సకల సౌకర్యాలతో నిర్మించిన టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందజే యకుండా జగన్‌ ప్రభుత్వం తాత్సారం చేయడంపై టీడీపీ నాయకులు మండి పడ్డారు. చంద్రబాబుకు పేరు రాకూడదన్న ఒకే ఒక్క ఉద్దేశ్యంతో వైసీపీ ప్రభుత్వం లబ్ధిదారులకు ఇళ్లు అప్పగించకుండా కుంటిసాకులు చెప్తోందని విమర్శించారు. ఉగాది నాటికి రాష్ట్రవ్యాప్తంగా 45వేల మంది లబ్ధిదారులకు టిడ్కో గృహాలు అప్ప చెబుతామన్న ప్రభుత్వ హామీ నేపఽథ్యంలో రాజమహేంద్రవరం రూరల్‌ బొమ్మూరు లోని టిడ్కో గృహాల సముదాయిన్ని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకుల బృందం శనివారం పరిశీలించింది. ఈ సందర్భంగా ఆదిరెడ్డి వాసు విరిగిన తలుపులు, పగిలిన కిటీకీ అద్దాలతో ఉన్న గృహాలను, చెత్తాచెదారంతో నిండి, తుప్పలు పెరిగి పోయిన పరిసరాలను చూపిస్తూ గృహాలను లబ్ధిదారులకు అందజేయాలన్న చిత్త శుద్ధి ప్రభుత్వానికి ఏమాత్రం లేదని విమర్శించారు. క్వారంటైన్‌గా ఉపయోగించు కున్న గృహాలను శుభ్రం చేయకుండా అలాగే వదిలివేశారన్నారు. లబ్ధిదారులకు గృహాలను సకాలంలో అప్పగించకపోతే తామే లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయి స్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడు తూ చంద్రబాబు హయాంలో గృహ ప్రవేశాలకు సిద్ధంగా ఉంచిన ఇళ్లను లబ్ధిదారు లకు ఇవ్వకుండా జగన్‌ ప్రభుత్వం శిథిలావస్థకు చేర్చిందని ధ్వజమెత్తారు. లబ్ధిదా రులు అప్పులు చేసి తమ వాటా సొమ్ము చెల్లించారని, ఇప్పుడు తీసుకున్న అప్పునకు వడ్డీలు చెల్లిస్తుండడంతో పాటు బ్యాంక్‌ లోన్‌ వాయిదాలు చెల్లించాల్సిన పరిస్ధితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి యర్రా వేణుగోపాలరాయుడు, రాష్ట్ర కార్యదర్శులు కాశి నవీన్‌కుమార్‌, వాసిరెడ్డి రాంబాబు మాట్లాడుతూ పేదలకు ఇచ్చే ఇళ్ల విషయంలో జగన్‌ ప్రభుత్వ వైఖరిని తప్పుబ ట్టారు. కార్యక్రమంలో టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రే శ్రీనివాసరావు, మజ్జి రాంబాబు, తెలుగు మహిళ రాష్ట్ర  కార్యనిర్వాహక కార్యదర్శి తురుకల నిర్మల, కొయ్యా రమణ, దాస్యం ప్రసాద్‌, రెడ్డి మణేశ్వరరావు, కోరుమిల్లి విజయ్‌శేఖర్‌, కడలి రామకృష్ణ, తంగెళ్ల బాబి, మరుకుర్తి రవియాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.



Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.