విజేతలకు బహుమతులు అందజేస్తున్న ప్రిన్సిపాల్
ఉదయగిరి రూరల్, జనవరి 25: మండలంలోని వెంగళరావునగర్ గ్రామంలో సంక్రాంతిని పురస్కరించుకుని వారం రోజులుగా నిర్వహించిన మెగా క్రికెట్ పోటీల్లో విజేతలకు మంగళవారం బహుమతులు ప్రదానం చేశారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న గండిపాళెం గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ మురళీకృష్ణ మాట్లాడుతూ క్రీడలతో మానసికోల్లాసం, శారీరక దృఢత్వం కలుగుతాయన్నారు. స్నేహా పూర్వక వాతావరణంలో పోటీలు నిర్వహించుకోవాలన్నారు. అనంతరం ప్రథమ, ద్వితీయస్థానాల్లో నిలిచిన వెంగళరావునగర్, ఉదయగిరి రెడ్‌రోజ్ జట్లకు నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు మహమ్మద్‌ఖాజా, కాకర్ల అబ్దుల్, నిర్వాహకులు నాగార్జున, మధు, పవన్, అశోక్, లక్ష్మయ్య, చంద్ర, రాజా, మల్లి తదితరులు పాల్గొన్నారు.