వృషభంపై ప్ర‌జ‌ల్లో చైతన్యం కోసమే నా పెయింటింగ్: మహేష్

ABN , First Publish Date - 2020-11-16T22:45:31+05:30 IST

వృషభంపై ప్ర‌జ‌ల్లో చైతన్యం కోసమే నా పెయింటింగ్: మహేష్

వృషభంపై ప్ర‌జ‌ల్లో చైతన్యం కోసమే నా పెయింటింగ్: మహేష్

హైద‌రాబాద్: వృషభాన్ని కాపాడే విష‌యంలో ప్ర‌జ‌ల్లో చైతన్యం తీసుకొచ్చేందుకే తాను పెయింటింగ్ వేశాన‌ని కడపకు చెందిన చిత్ర‌కారుడు కంగనపల్లి మహేష్ కుమార్ తెలిపారు. త‌న క‌ళ దేశశ్రేయస్సుకు ఉప‌యోగ‌ప‌డాల‌నేదే త‌న తాప‌త్రాయ‌మ‌ని చెప్పారు. కడపకు చెందిన మహేష్ యోగివేమన యూనివర్సిటీలో బీఏ ఫైన్ ఆర్ట్స్‌ చదివారు. హైదరాబాద్ జేఎన్‌టియూలో ఎంఏ ఫైన్ ఆర్ట్స్‌ చదివారు. చిన్నప్పటి నుంచీ చిత్రకళపై తనకు ఆసక్తి ఉండేదని చెప్పారు. అయితే బాల్యంలో చదివే గొప్పదని భావించిన తన తల్లిదండ్రులు తాను వేసిన పెయింటింగ్స్ అన్నింటినీ కాల్చివేశారని మహేశ్ గుర్తు చేసుకున్నారు. అదే రోజు చిత్రకళలో బాగా రాణించాలని నిర్ణయించుకున్నట్లు మహేశ్ తెలిపారు. సమాజం బాగు కోసం, ప్రజలను చైతన్యవంతులను చేయడం కోసం పెయింటింగ్స్ వేయడం కొనసాగిస్తున్నానని చెప్పారు. ప్రాచీన వేద వ్యవసాయ పద్ధతులపై కృషి చేస్తోన్న కృషి భారతం సంస్థకు పెయింటింగ్స్ వేయడం ద్వారా తన కల నెరవేరిందని మహేశ్ చెప్పారు. 



కృషి భారతం వ్యవస్థాపకుడైన తన స్నేహితుడు కౌటిల్య కృష్ణన్...  అంతరించిపోతున్న వృషభాల సంరక్షణకు నడుం కట్టడం తనను కదిలింపచేసిందని మహేశ్ చెప్పారు. వ్యవసాయ ప్రధానమైన భారతదేశంలో వృషభం కనమరుగైపోతుండటం చూసి తట్టుకోలేకపోయానని, రైతులను చైతన్యపరిచి వృషభ సంరక్షణ ఉద్యమాన్ని ముందు తీసుకెళ్లేందుకే పెయింటింగ్స్ వేస్తున్నానని తెలిపారు. దేశంలో రైతన్న ఆనందంగా ఉండాలంటే గో సంపదలో భాగమైన వృషభాన్ని కాపాడేందుకు అంతా తోడ్పడాలని మహేశ్ కోరుతున్నారు. దేశం బాగు కోసం, సమాజం మేలు కోసం తన చిత్రకళ కొనసాగిస్తానని మహేశ్ చెబుతున్నారు. కృషి భారతం సంస్థకు మహేశ్ వేసిన పెయింటింగ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. 

Updated Date - 2020-11-16T22:45:31+05:30 IST