
కృష్ణా: జిల్లాలోని కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజ వద్ద జాతీయ రహదారిపై మినీ ఆటో దగ్ధమయింది. ఆగిరిపల్లి నుంచి చందర్లపాడు వెళ్తుండగా ఒక్కసారిగా ఆటోలో మంటలు చెలరేగాయి. పొగ వస్తుంది అని గమనించి ప్రయాణికులను ఆటో డ్రైవర్ అప్రమత్తం చేశాడు. దీంతో ఆటో నుంచి 10 మంది అయ్యప్ప స్వామి భక్తులు దిగి సురక్షితంగా బయటపడ్డారు. పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.