Krishna: అవనిగడ్డలో యువకుడు దారుణ హత్య

ABN , First Publish Date - 2022-09-26T13:28:31+05:30 IST

అవనిగడ్డ మండలంలో దారుణ హత్య జరిగింది. బచ్చు శ్రీనివాస్ (33) యువకుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు

Krishna: అవనిగడ్డలో యువకుడు దారుణ హత్య

Krishna: అవనిగడ్డ(Avanigadda) మండలంలో దారుణ హత్య జరిగింది. బచ్చు శ్రీనివాస్ (33) యువకుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన అవనిగడ్డ మండలంలోని రామచంద్రపురం గ్రామంలో అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఈ హత్య స్థానికంగా రామచంద్రపురంలో కలకలం రేపుతోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యకు గల కారణం వివాహేతర సంబంధం నేపథ్యంలోనే జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. హత్యకు గురైన శ్రీనివాస్ గ్రామ ఉప సర్పంచ్ సోదరుడుగా పోలీసులు గుర్తించారు.

Updated Date - 2022-09-26T13:28:31+05:30 IST