ఓటర్లను ప్రభావితం చేయడాన్ని నిషేధించాం: కృష్ణా జిల్లా కలెక్టర్

ABN , First Publish Date - 2021-03-06T19:25:58+05:30 IST

విజయవాడ, మచిలీపట్నం నగరపాలక సంస్ధలు, మిగతా పురపాలక సంఘాల ఎన్నికల్లో వాలంటీర్లు పాల్గొనకూడదని కృష్ణా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

ఓటర్లను ప్రభావితం చేయడాన్ని నిషేధించాం: కృష్ణా జిల్లా కలెక్టర్

విజయవాడ:  విజయవాడ, మచిలీపట్నం నగరపాలక సంస్ధలు, మిగతా పురపాలక సంఘాల ఎన్నికల్లో వాలంటీర్లు పాల్గొనకూడదని కృష్ణా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. రాజకీయ పార్టీలకు లబ్దిచేకూర్చేలా చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్లను ప్రభావితం చేయడాన్ని నిషేధించామని... అటువంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. వాలంటీర్లపై ఫిర్యాదులు ఉంటే కృష్ణా జిల్లాలో 8186038738 వాట్సాప్‌ నంబర్‌కు పంపాలని కలెక్టర్ కోరారు. 

Updated Date - 2021-03-06T19:25:58+05:30 IST