'లక్షణాలు అధికంగా ఉంటేనే ఆసుపత్రిలో చేరండి'

ABN , First Publish Date - 2021-04-22T20:41:40+05:30 IST

'లక్షణాలు అధికంగా ఉంటేనే ఆసుపత్రిలో చేరండి'

'లక్షణాలు అధికంగా ఉంటేనే ఆసుపత్రిలో చేరండి'

విజయవాడ: కోవిడ్ లక్షణాలు అధికంగా ఉన్నవారు మాత్రమే ఆసుపత్రిలో చేరాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ సూచించారు. గురువారం జిల్లాలో కోవిడ్ పరిస్థితిపై మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ సమావేవంలో జిల్లా ఎస్పీతో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 27 కోవిడ్ ఆసుపత్రికి అనుమతి ఇచ్చామని తెలిపారు. జిల్లావ్యాప్తంగా 150 సెంటర్లో వ్యాక్సినేషన్ రెండోదశ కొనసాగుతోందని, విజయవాడలో మచిలీపట్నంలో హోమ్ ఐసొలేషన్  కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కోవిడ్ వేగంగా విస్తరిస్తునందున మాస్క్, శానిటైజర్లను ప్రతి ఒక్కరు తప్పకుండా వాడాలని కలెక్టర్ ఇంతియాజ్ సూచించారు.

Updated Date - 2021-04-22T20:41:40+05:30 IST