కృష్ణా: రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. రెండ్రోజులుగా కృష్ణా జిల్లాలోని తిరువూరు నియోజకవర్గంలో గడిచిన 24 గంటల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. తిరువూరులో 7.80 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు కాగా..గంపలగూడెం 5.06, ఏ-కొండూరు 4.50, విస్సన్నపేట 8.74 సెంటీమీటర్లుగా నమోదైంది. భారీ వర్షాలతో తిరువూరు నియోజకవర్గంలో పలు గ్రామాలు జలమయమయ్యాయి. వాగులు, చెరువులు, పొంగిపొర్లుతున్నాయి.