AP News: కృష్ణా జిల్లా: పెడనలో ఉద్రిక్తత..

ABN , First Publish Date - 2022-08-22T21:15:53+05:30 IST

పెడనలో ఉద్రిక్తత నెలకొంది. జనసేన నాయకుల ఆందోళనను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు.

AP News: కృష్ణా జిల్లా: పెడనలో ఉద్రిక్తత..

కృష్ణా జిల్లా (Krishna Dist.): పెడనలో ఉద్రిక్తత నెలకొంది. జనసేన (Janasena) నాయకుల ఆందోళనను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan)పై మంత్రి జోగి రమేష్ (Jogi Ramesh) అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో జనసేన నేత యడ్లపల్లి రామ్ సుధీర్ (Ram Sudhir) ఆధ్వర్యంలో జనసైనికులు ఆందోళనకు దిగారు. జోగి రమేష్‌కు శవయాత్ర నిర్వహించి.. దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు యత్నించారు. జనసేన శ్రేణులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. దీంతో పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపై బైఠాయించారు. మంత్రి జోగి రమేష్  డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్బంగా యడ్లపల్లి రామ్ సుధీర్ మాట్లాడుతూ మంత్రి జోగి రమేష్ బీసీ ద్రోహి అని, కులాన్ని అడ్డం పెట్టుకుని రెచ్చ గొడుతున్నారని మండిపడ్డారు. పెడన నియోజకవర్గ ప్రజలకు, పవన్ కళ్యాణ్‌కు మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జోగి రమేష్‌కు సిగ్గుంటే ప్రజా సమస్యలపై స్పందించాలన్నారు. బూతులతో మంత్రి పదవి తెచ్చుకున్న జోగి రమేష్ సంస్కారహీనుడని, మంత్రిని వైసీపీ వాళ్లే తరిమికొట్టే రోజులు వస్తాయని రామ్ సుధీర్ అన్నారు.

Updated Date - 2022-08-22T21:15:53+05:30 IST