
కృష్ణాజిల్లా: నందిగామలో కేవీఆర్ కాలేజీ విద్యార్థులు నాల్గవ రోజు నిరసనకు సిద్ధమవుతుండగా పోలీసులు ముందస్తు చర్యలతో అడ్డుకున్నారు. విద్యార్థులతో పోలీస్ అధికారులు చర్చలు జరిపి వారిని తరగతి గదులకు పంపించారు. కళాశాలకు ఉన్నతాధికారులు వస్తారన్న సమాచారం ఉండడంతో తాము సాయంత్రం వరకు వేచిచూస్తామని, ఆ తర్వాత కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని విద్యార్థులు చెప్పారు.