జగన్ మాట తప్పారు... మడమ తిప్పారు: ఉపాధ్యాయులు

ABN , First Publish Date - 2022-01-20T17:24:03+05:30 IST

కృష్ణా జిల్లా: ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా ఉద్యోగ, ఉపాద్యాయ సంఘాలు ఆందోళన చేపట్టాయి.

జగన్ మాట తప్పారు... మడమ తిప్పారు: ఉపాధ్యాయులు

కృష్ణా జిల్లా: ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా ఉద్యోగ, ఉపాద్యాయ సంఘాలు ఆందోళన చేపట్టాయి. మచిలీపట్నం కలెక్టరేట్ ముట్టడికి పిలుపిచ్చాయి. దీంతో ఆందోళన కారులను పోలీసులు మార్గమధ్యంలో అడ్డుకుంటున్నారు. కలెక్టరేట్ వైపు వెళితే అరెస్టులు చేస్తామని  హెచ్చరిస్తున్నారు. మహిళా ఉపాధ్యాయులపై కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. అయినా ఉపాధ్యాయులు బారికేడ్లను తోసుకుని ముందుకి వచ్చారు. దీంతో పోలీసులు పలువురిని అరెస్టు చేసి పీఎస్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ ‘‘జగన్ మాట తప్పారు... మడమ తిప్పారు.. ఎన్నికలకు ముందు చెప్పిందేమిటి, ఇప్పుడు చేసిందేమిటి.. మా హక్కులను హరించి వేయడం మీకు ధర్మమా... పురోగమనం లేకపోగా తిరోగమన విధానం జగన్ పాలనలోనే చూస్తున్నాం.. పోలీసులను అడ్డం పెట్టుకుని అడ్డుకుంటారా?.. మా న్యాయమైన డిమాండ్‌లను అడిగే హక్కు కూడా లేదా?.. కనీసం నిరసన తెలిపే అవకాశం కూడా ఇవ్వకపోవడం దుర్మార్గం.. మా ఛీఫ్ సెక్రటరీతో కూడా అబద్ధాలు చెప్పిస్తున్నారు.. అన్ని ధరలు పెరుగుతుంటే... హెచ్ఆర్ఏ తగ్గించడం ఏమిటి?’’ అంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్ స్పందించి న్యాయం చేయాలని కోరారు. లేదంటే సమ్మె బాట పడతామని ఉపాధ్యాయులు స్పష్టం చేశారు.

Updated Date - 2022-01-20T17:24:03+05:30 IST