
కృష్ణా: జిల్లాలో అధికారులకు రైతుల నిరసన సెగ తగిలింది. ఖమ్మం- విజయవాడ గ్రీన్ ఫీల్డ్ హైవే పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ సమావేశంలో ఉద్రిక్తత ఏర్పడింది. అధికారుల తీర్పుకు నిరసనగా సమావేశాన్ని రైతులు బాయ్‌కట్ చేశారు. ఎన్విరాన్మెంట్ అధికారి కె.విజయమోహన్ తీరుపై కవులూరు రైతులు, ప్రజాప్రతినిధులు తీవ్ర నిరసన తెలిపారు. కొండపల్లి పారిశ్రామికవాడ పొల్యూషన్ పరిశీలనకు రావాలని పొల్యూషన్ అధికారిని పీఏసీఎస్ చైర్మన్ గొట్టిముక్కల ఓంకారబాబు అడిగారు. అయితే అధికారి దురుసుగా సమాధానం చెప్పి అవమానించేలా మాట్లాడారు. దీంతో జడ్పీ పాఠశాల గేటును మాజీ జడ్పీటీసీ కాజా బ్రహయ్య మూసివేసి అధికారులను ఘెరావ్ చేశారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య అధికారిని బయటకు తెచ్చి పోలీసులు స్టేషన్‌కు పోలీసులు తరలించారు.
ఇవి కూడా చదవండి