ఆక్సిజన్ పర్యవేక్షణకు ఎనిమిది ప్రత్యేక బృందాలు: జేసీ శివశంకర్

ABN , First Publish Date - 2021-05-15T19:43:37+05:30 IST

: కృష్ణా జిల్లాలో ఆక్సిజన్ కొరత లేకుండా 24 గంటల పాటు ప్రత్యేక మోనటరింగ్ చేస్తున్నామని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ శివశంకర్ తెలిపారు.

ఆక్సిజన్ పర్యవేక్షణకు ఎనిమిది ప్రత్యేక బృందాలు: జేసీ శివశంకర్

విజయవాడ: కృష్ణా జిల్లాలో ఆక్సిజన్ కొరత లేకుండా 24 గంటల పాటు ప్రత్యేక మోనటరింగ్ చేస్తున్నామని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ శివశంకర్ తెలిపారు. శనివారం ఏబీఎన్‌తో మాట్లాడుతూ కృష్ణా జిల్లాలో రోజుకి 90 నుంచి 95 టన్నుల ఆక్సిజన్ అవసరం ఉందన్నారు. జిల్లాకు రాష్ట్రంలోని 4 ప్రాంతాల నుంచి 80 నుంచి 85 టన్నుల ఆక్సిజన్ వస్తుందని తెలిపారు. ఆక్సిజన్‌ను పర్యవేక్షించేందుకు 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఐదు రీ ఫిల్లింగ్ యూనిట్స్ ద్వారా ఆక్సిజన్ సిలెండర్లను సరఫరా చేస్తున్నామన్నారు. అవసరం మేరకు ఆక్సిజన్‌ను ఆసుపత్రులకు పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఆక్సిజన్‌ను ఇంటి వద్ద ఉపయోగించేవారు సుమారు 40 నుంచి 50 మంది వరకు ఉన్నారన్నారు. తొలుత ప్రాధాన్యతగా హాస్పిటల్స్‌కు మాత్రమే ఇస్తున్నామని జాయింట్ కలెక్టర్ శివశంకర్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-05-15T19:43:37+05:30 IST