కానూరులో పాలకేంద్రం వద్ద ఉద్రిక్తత

ABN , First Publish Date - 2021-05-07T06:34:32+05:30 IST

కానూరు గాంధీ బొమ్మ సెంటర్‌ వద్ద ఉన్న ప్రభుత్వ పశు వైద్యశాలలోని కృష్ణా మిల్క్‌ యూనియన్‌కు చెందిన పాలకేంద్రం వద్ద గురువారం రాత్రి ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

కానూరులో పాలకేంద్రం వద్ద ఉద్రిక్తత

రూ.5 లక్షల బిల్లులు చెల్లించాలంటూ ఆందోళన

పెనమలూరు, మే 6: కానూరు గాంధీ బొమ్మ సెంటర్‌ వద్ద ఉన్న ప్రభుత్వ పశు వైద్యశాలలోని కృష్ణా మిల్క్‌ యూనియన్‌కు చెందిన పాలకేంద్రం వద్ద గురువారం రాత్రి ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పశువులు నుంచి సేకరించిన స్వచ్ఛమైన గేదె పాలను నిత్యం పాల కేంద్రం వద్ద పోసె రైతులకు (పశుపోషకులు) దాదాపు రెండు నెలల నుంచి సుమారు 5 లక్షల వరకు చెల్లించాల్సిన బిల్లులను చెల్లించక పోవడంతో ఆందోళనకు దిగారు. స్థానికంగా ఏర్పాటు చేసిన పాలకేంద్రం బోర్డు అధ్యక్షురాలి భర్త వీరాంజనేయులు నిలదీశారు. అయన తమ బిల్లులు ఎప్పుడో చెల్లించామని కావాలంటే పోలీసు కేసులు పెట్టుకోండి అని ఘాటుగా సమాధానం చెప్పడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో కేంద్రం వద్ద పాలను సేకరించే రాజు అనారోగ్యంతో మృతిచెందడంతో ఇదే అదను చేసుకుని బోర్డు అధ్యక్షుడు అతనిపై నేరం మోపుతున్నాడని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 నిత్యం కానూరు నుంచి 480 లీటర్ల స్వచ్ఛమైన గేదె పాలు విజయ డెయిరీ ప్రాజెక్టుకు చేరతాయని రైతులు చెబుతున్నారు. 15 రోజులకు ఒకసారి చెల్లించాల్సిన బిల్లులను రెండు నుంచి మూడు నెలల పాటు నిలుపుదల చేయడంలో బోర్డు అధ్యక్షుల చేతివాటం ఉందని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై నేడు రైతులు, బోర్డు కమిటీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని రైతులు చెబుతున్నారు.


Updated Date - 2021-05-07T06:34:32+05:30 IST