ఉత్సవ ‘జల’ధితరంగా..

Published: Tue, 16 Aug 2022 00:51:35 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఉత్సవ జలధితరంగా..

కొండకోనలు మీటి.. అడవి దారులు దాటి.. గలగలా.. బిరబిరా.. తరలివచ్చే కృష్ణమ్మా.. నీ మార్గమెప్పుడూ మాకు మార్గదర్శకమేనమ్మా.. పుడమికి పచ్చటి వన్నెలు పులిమె నీ చెలిమో, నీ నీటి గుణమో, ఈ నేల మహిమో కానీ, స్వాతంత్య్ర సమరంలో స్వేచ్ఛకోసం రగిలి జాతి జెండాలై రెపరెపలాడారు ఈ గడ్డ బిడ్డలు. ఆ అమరుల ఆకాంక్షలకు చిహ్నంగా.. స్వాతంత్య్ర దినోత్సవ వేళ.. నీలో ఈ జలానంద హేల. వినీలాకాశాన్ని, నీలోని నీలవేణిని, వజ్రోత్సవాన వజ్రాలు పొదిగిన ప్రకాశం బ్యారేజీని ఏకం చేసిన నీ రూపం అందం.. అద్భుతం.. ఉత్సవ ‘జల’ధితరంగం.. ఫ (నీలాకాశాన్ని, నీలాల కృష్ణవేణిని కలిపినట్టుగా సోమవారం రాత్రి నగరంలోని రాజీవ్‌గాంధీ పార్కు వద్ద ఆవిష్కృతమైంది ఈ అద్భుతం)

- జి.కొండూరు



Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.