సాగర్‌ నీటిమట్టం

ABN , First Publish Date - 2022-08-10T05:59:00+05:30 IST

నాగార్జునసాగర్‌ నీటిమట్టం మంగళవారం నాటికి 577.80 అడుగులు ఉంది. ఇది 276.66 టీఎంసీలకు సమానం.

సాగర్‌ నీటిమట్టం
ప్రకాశం బ్యారేజి దిగువకు విడుదల అవుతున్న వరదనీరు

విజయపూరిసౌత్‌, ఆగస్టు 9: నాగార్జునసాగర్‌ నీటిమట్టం మంగళవారం నాటికి 577.80 అడుగులు ఉంది. ఇది 276.66 టీఎంసీలకు సమానం. కుడికాలువ ద్వారా 2,236 క్యూసెక్కులు, ఎడమకాలువ ద్వారా 2,557, ప్రధాన జలవిద్యుత్‌కేంద్రం ద్వారా 25,242, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1,200, వరద కాలువ ద్వారా 300 క్యూసెక్కులు, మొత్తం ఔట్‌ఫ్లోవాటర్‌గా 31,535 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి  ఇన్‌ఫ్లో వాటర్‌గా 2,30,500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది.

 బ్యారేజి దిగువకు లక్ష క్యూసెక్కులు  

తాడేపల్లి టౌన్‌, ఆగస్టు9: ఎగువన ఉన్న వాగుల నుంచి ప్రకాశం బ్యారేజి రిజర్వాయర్‌కు వరదనీటి ఉధృతి క్రమేపీ పెరుగుతోంది. కీసర, మునేరు, పాలేరు, మధిర, ముజినేపల్లి తదితర వాగుల నుంచి మంగళవారం సాయంత్రానికి లక్షా 8వేల క్యూసెక్కుల వరదనీరు ఇన్‌ఫ్లోగా వచ్చి చేరుతున్నట్టు అధికారులు తెలిపారు. తూర్పు, పశ్చిమ డెల్టా కాలువలకు 7,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. బ్యారేజి రిజర్వాయర్‌ వద్ద 12 అడుగుల నీటిమట్టం కొనసాగిస్తూ, 70 గేట్లను 2అడుగుల మేర ఎత్తి లక్షా 600 క్యూసెక్కుల వరదనీటిని దిగువకు వదులుతున్నట్టు తెలిపారు.  


Updated Date - 2022-08-10T05:59:00+05:30 IST