ఆటో-రెండు బైక్‎లు ఢీ..11 మందికి తీవ్రగాయాలు

Published: Mon, 08 Nov 2021 11:46:02 ISTfb-iconwhatsapp-icontwitter-icon

కృష్ణా: ముదినేపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో- రెండు బైక్‎లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మొత్తం 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. మరో ఇద్దరి పరిస్థితి విషమించింది. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న గుడివాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నాగుల చవితి సందర్భంగా పుట్టలో పాలు పోసేందుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.