
కృష్ణా: జిల్లాలోని పెదపారుపూడి మండలం ఈదుల మద్దాలిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతు శ్రీనివాసరావు మృతదేహంతో ఆందోళన కొనసాగుతోంది. రెవిన్యూ అధికారులతో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. శ్రీనివాస్ రావు మృతితో అతని నలుగురు కుమార్తెలు అనాథలయ్యారని గ్రామస్తులు ఆరోపించారు. తక్షణమే నిందితులపై 302 సెక్షన్ కింద కేసు నమోదు చేసి, బాధిత కుటుంబానికి ఎక్స్ గ్రేషియ ప్రకటించాలని గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. క్యాసినో మంత్రి పీఏ పాత్రపై కూడా పోలీసులు నిగ్గు తేల్చాలని వారు డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి