10లోగా తుపాకులు అప్పగించాలి: ఎస్పీ

ABN , First Publish Date - 2022-05-01T18:10:59+05:30 IST

ప్రజలు స్వచ్ఛందంగా తమవద్ద ఉన్న నాటు తుపాకీలను అప్పగించాలని కృష్ణగిరి జిల్లా ఎస్పీ సరోజ్‌కుమార్‌ ఠాగూర్‌ ఇక్బా పేర్కొన్నారు. ఇటీవల

10లోగా తుపాకులు అప్పగించాలి: ఎస్పీ

హోసూరు(బెంగళూరు): ప్రజలు స్వచ్ఛందంగా తమవద్ద ఉన్న నాటు తుపాకీలను అప్పగించాలని కృష్ణగిరి జిల్లా ఎస్పీ సరోజ్‌కుమార్‌ ఠాగూర్‌ ఇక్బా పేర్కొన్నారు. ఇటీవల భాద్యతలు స్వీకరించిన వెంటనే జిల్లాలో గంజా యి, గుట్కా, లాటరీ, మద్యం అక్రమ విక్రయాలపై ఉక్కుపాదం మోపారు. సరోజ్‌కుమార్‌ ఠాగూర్‌ మాట్లాడు తూ జిల్లాలో వన్యప్రాణుల వేటను నియంత్రించేందుకు చర్యలు చేపట్టామన్నారు. కాగా ఎస్పీ ఆదేశాలతో అన్ని సబ్‌డివిజన్‌లలో డిప్యూటీ సూపరిండెంట్‌ నేతృత్వంల్లో పంచాయతీ నాయకుల సహకారంతో తమ ప్రాంతాలలో అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నవారు మే 10లోగా స్వచ్ఛందంగా అప్పగించాలన్నారు. ఆయుధాలను అక్రమంగా కలిగి ఉండడం నేరమని నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. 

Updated Date - 2022-05-01T18:10:59+05:30 IST