Krishnam Raju: కృష్ణంరాజు విజయనగరం అల్లుడే

ABN , First Publish Date - 2022-09-12T02:03:38+05:30 IST

సినీ నటుడు కృష్ణంరాజు (Krishnam Raju) మృతితో విజయనగరం జిల్లా (Vizianagaram District)లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Krishnam Raju: కృష్ణంరాజు విజయనగరం అల్లుడే

విజయనగరం: సినీ నటుడు కృష్ణంరాజు (Krishnam Raju) మృతితో విజయనగరం జిల్లా (Vizianagaram District)లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన అత్తవారు గ్రామం విజయనగరానికి కూతవేటు దూరంలోని ద్వారపూడి. గ్రామానికి చెందిన శ్యామలాదేవిని కృష్ణంరాజు రెండో వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి ఆయన ద్వారపూడి వస్తుండేవారని గ్రామస్థులు చెబుతున్నారు. సినీ, రాజకీయ రంగాల్లో కృష్ణంరాజు బిజీగా ఉండడంతో శ్యామలాదేవి ఒకరే పిల్లలను తీసుకొని వస్తుండేవారని గ్రామస్థులు తెలిపారు. కృష్ణంరాజు మరణవార్త తెలుసుకొని ద్వారపూడిలోని కుటుంబసభ్యులు హైదరాబాద్‌ బయలుదేరి వెళ్లారు. 1996లో శ్యామలాదేవిని రెండవ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు.

Updated Date - 2022-09-12T02:03:38+05:30 IST