తిరుమల: టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా కృష్ణమూర్తి వైద్యనాథన్ ఆదివారం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణస్వీకారం చేశారు. బంగారు వాకిలి వద్ద టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. తర్వాత కృష్ణమూర్తి వైద్యనాథన్ శ్రీవారిని దర్శించుకుని రంగనాయక మండపానికి చేరుకోగా వేదపండితులు ఆశీర్వచనం చేశారు. ఆయనకు ఽధర్మారెడ్డి శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, కాఫీ టేబుల్ బుక్‌ను అందజేశారు.