సీమ పర్యటనను రద్దు చేసుకోండి

ABN , First Publish Date - 2021-04-19T09:55:05+05:30 IST

‘తెలుగు రాష్ట్రాల్లో కరోనా తీవ్రత అత్యధికంగా ఉంది. రాయలసీమ ప్రాంత ఇంజనీరింగ్‌ అధికారులూ కరోనా బారిన పడ్డారు.

సీమ పర్యటనను రద్దు చేసుకోండి

కేఆర్‌ఎంబీకి జల వనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు లేఖ


అమరావతి, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): ‘‘తెలుగు రాష్ట్రాల్లో కరోనా తీవ్రత అత్యధికంగా ఉంది. రాయలసీమ ప్రాంత ఇంజనీరింగ్‌ అధికారులూ కరోనా బారిన పడ్డారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం (ఆర్‌ఎల్‌ఎస్‌) పనులను సోమ, మంగళవారాల్లో పర్యవేక్షించాలన్న నిర్ణయాన్ని వాయిదా వేసుకోండి’’ అని జల వనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శికి కోరారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం (ఆర్‌ఎల్‌ఎస్‌) పర్యవేక్షణను వ్యతిరేకిస్తూ ఇప్పటివరకూ కేఆర్‌ఎంబీకి పలు లేఖలను రాసిన విషయాన్ని తన తాజా లేఖలో శ్యామలరావు గుర్తు చేశారు. కేఆర్‌ఎంబీ బోర్డు సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించి తెలంగాణ నిర్మిస్తోన్న అక్రమ ప్రాజెక్టులను ముందుగా పరిశీలించాలన్నారు. 

Updated Date - 2021-04-19T09:55:05+05:30 IST