TRS NRI KUWAIT ఆధ్వర్యంలో కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు

ABN , First Publish Date - 2022-07-25T16:28:31+05:30 IST

ఐటీ, పురపాలక శాఖ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పుట్టిన రోజు వేడులు టీఆర్ఎస్ Nri కువైట్ అధ్యక్షులు అభిలాష గొడిశాల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అభిలాష మాట్లాడారు. సోషల్ మీడియా పోస్టులకు కూడా స్పందిస్తూ కే

TRS NRI KUWAIT ఆధ్వర్యంలో కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు

ఎన్నారై డెస్క్: ఐటీ, పురపాలక శాఖ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పుట్టిన రోజు వేడులు టీఆర్ఎస్ Nri కువైట్ అధ్యక్షులు అభిలాష గొడిశాల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అభిలాష మాట్లాడారు. సోషల్ మీడియా పోస్టులకు కూడా స్పందిస్తూ కేటీఆర్.. ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్నారన్నారు. ఇప్పటి వరకు ఎంతో మంది ప్రాణాలను కాపాడారన్నారు. యువనాయకుడిగా యువతను ముందుకు నడిపిస్తున్నారన్నారు. భవిష్యత్తులో KCR‌ను ప్రధానమంత్రిగా, KTR‌ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నట్టు చెప్పారు. కేటీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. కేక్ కట్ చేసి కువైట్ టీం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.



తెలంగాణ జాగృతి కువైట్ అధ్యక్షులు ముత్యాల వినయ్ కుమార్ మాట్లాడుతూ.. KTR లాంటి నాయకులు తెలంగాణకి దొరకడం ప్రజల అదృష్టం అని అభిప్రాయపడ్డారు. అలాంటి నాయకుడిని అందించిన KCR‌కు ధన్యవాదాలు తెలిపారు. కేటీఆర్ ఇటువంటి వేడుకలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. సుభాన్ సోహీల్ మాట్లాడుతూ కువైట్లోని అన్ని తెలుగు సంఘాల తరఫున KTRకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఅర్ఎస్ కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల, తెలంగాణ జాగృతి కువైట్ అధ్యక్షులు ముత్యాల వినయ్ కుమార్, సురేష్ గౌడ్, సుభాన్ సొహీల్, రవి గన్నరపు, అయ్యప్ప, ప్రమోద్ కుమార్ మర్క, రవి సుధగని, అశోక్ చార్య, మహమ్మద్ జలాల్ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-07-25T16:28:31+05:30 IST