గనులపై ఘనంగా కేటీఆర్‌ జన్మదిన వేడుకలు

ABN , First Publish Date - 2021-07-25T06:01:23+05:30 IST

రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ జన్మదిన వేడుకలను శనివారం ఆర్‌జీ-1 పరిధిలోని పలు బొగ్గు గనులపై ఘనంగా నిర్వహించారు.

గనులపై ఘనంగా కేటీఆర్‌ జన్మదిన వేడుకలు
ఆర్జీ-1 కార్మికునికి కేక్‌ తినిపిస్తున్న ఎమ్మెల్యే చందర్‌

గోదావరిఖని, జూలై 24: రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ జన్మదిన వేడుకలను శనివారం ఆర్‌జీ-1 పరిధిలోని పలు బొగ్గు గనులపై ఘనంగా నిర్వహించారు. జీడీకే 2ఇంక్లైన్‌ గనిపై జరిగిన వేడుకలకు ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ కేక్‌కట్‌ చేశారు. ఆర్‌జీ-1 టీబీజీకేఎస్‌ ఉపాధ్యక్షులు గండ్ర దామోదర్‌రావు, నాయకులు కే మల్లయ్య, పెద్దపల్లి సత్యనారాయణ, పెంచాల తిరుపతి, మ్యాజిక్‌ హరి, ఫయాజ్‌ పాల్గొన్నారు. జీడీకే 1ఇంక్లైన్‌ బొగ్గు గనిపై జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే చందర్‌ పాల్గొని కేక్‌కట్‌ చేసి కార్మికులకు మిఠాయిలు తినిపించారు. టీబీజీకేఎస్‌ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-25T06:01:23+05:30 IST