తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తుంది: KTR

ABN , First Publish Date - 2022-07-05T01:43:51+05:30 IST

Hyderabad: ఇండస్ట్రీ ప్రొడక్టివిటీ, ఆగ్రో‌బేస్డ్ ఇండస్ట్రీ, మార్కెటింగ్ ఇనిషియేటీవ్ తదితర రంగాలకు వివిధ కేటగిరీల్లో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తుంది: KTR

Hyderabad: ఇండస్ట్రీ ప్రొడక్టివిటీ, ఆగ్రో‌బేస్డ్ ఇండస్ట్రీ, మార్కెటింగ్ ఇనిషియేటీవ్ తదితర రంగాలకు వివిధ కేటగిరీల్లో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అవార్డులు అందజేశారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 


 ‘‘ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు వెళుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఎంఎస్ఎంఈలకు వారంలో మూడు రోజులు పవర్ హాలిడే ఉండేది. ఇందిరాపార్క్‌ వద్ద కోసం ధర్నాలు చేసేవారు.  కానీ రాష్ట్రం ఏర్పడ్డాక కరెంట్ కోతలు లేవు. 24 గంటలు కరెంటు అందిస్తున్నాం. దేశంలో ఎన్నో రాష్ట్రాలతో పోలిస్తే మనం అన్ని రంగాల్లో ముందున్నాం. ఇది ఎంతో గర్వించదగ్గ విషయం. ఓవర్సీస్ ఇన్వెస్టర్లు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. టీఎస్‌ఐ పాస్ ద్వారా పరిశ్రమలకు పదిహేను రోజుల్లో అనుమతులు లభిస్తున్నాయి. దేశంలో ఇక్కడ ఇలాంటి పాలసీ లేదు. ఎనిమిదేళ్ళలో రాష్ట్రంలో పరిశ్రమలకు ఎలాంటి సమస్యలు లేవు. గుజరాత్‌లో పవర్ హాలిడేలు ఉన్నాయి. కానీ ఇక్కడ పవర్ హాలిడే‌లు లేవు. ఇక్కడ పారిశ్రామికవేత్తలకు  ప్రభుత్వ జోక్యం కానీ ఎలాంటి వేధింపులు కానీ లేవు. రాష్ట్రంలో ఉన్న అనుకూలమైన వసతుల కారణంగా ఇన్వెస్టర్లు రాష్ట్రానికి వస్తున్నారు. హైదరాబాద్‌లో పెట్టుబడులకు తెలంగాణ బ్యాక్ బోన్..తెలంగాణలో టీ హాబ్ లార్జెస్ట్ ఇంక్యుబేటర్. నల్గొండ,ఖమ్మం, నిజామాబాద్‌, కరీంనగర్‌, మహబూబ్ నగర్‌ కూడా పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలం. ఎన్నో సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఫిషరీస్‌లో తెలంగాణ దేశంలో నెంబర్ వన్ అయింది.ఆయిల్ ఫామ్‌పై ఫోకస్ చేస్తాం’’ అని  పేర్కొన్నారు. 

Updated Date - 2022-07-05T01:43:51+05:30 IST