TS News: కేటీఆర్, కల్వకుంట్ల కుటుంబం వల్లే హెచ్‌సీఏ భ్రష్టుపట్టింది: వివేక్‌

ABN , First Publish Date - 2022-09-25T01:27:59+05:30 IST

మంత్రి కేటీఆర్ (Minister KTR), కల్వకుంట్ల కుటుంబం వల్లే హెచ్‌సీఏ భ్రష్టుపట్టిందని హెచ్‌సీఏ (HCA) మాజీ ప్రెసిడెంట్ వివేక్‌ ఆరోపించారు.

TS News: కేటీఆర్, కల్వకుంట్ల కుటుంబం వల్లే హెచ్‌సీఏ భ్రష్టుపట్టింది: వివేక్‌

హైదరాబాద్: మంత్రి కేటీఆర్ (Minister KTR), కల్వకుంట్ల కుటుంబం వల్లే హెచ్‌సీఏ భ్రష్టుపట్టిందని హెచ్‌సీఏ (HCA) మాజీ ప్రెసిడెంట్ వివేక్‌ ఆరోపించారు. ఎమ్మెల్సీ కవిత (Kavitha)ను హెచ్‌సీఏ ప్రెసిడెంట్ చేయటానికి సీఎం కేసీఆర్ గేమ్ ఆడి విఫలమయ్యారని తెలిపారు. టీ20 మ్యాచ్ టికెట్ల విక్రయాలపై వైట్ పేపర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌గా అజరుద్దీన్‌ ఫెయిలయ్యారని ఆరోపించారు. హెచ్‌సీఏలో తాజా పరిణామాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. హెచ్‌సీఏలో ఇలాంటి గందరగోళం ఎప్పుడూ లేదని తెలిపారు. గతంలో తన ప్యానల్‌ను ఓడించటానికి కేటీఆర్ విపలయత్నం చేశాడని గుర్తుచేశారు. కూతురు కోసం హెచ్‌సీఏ ఎన్నికల్లో తనను పోటీ చేయొద్దని సీఎం కేసీఆర్ గతంలో అన్నారని వివేక్‌ పేర్కొన్నారు. 

Updated Date - 2022-09-25T01:27:59+05:30 IST