Nirmala Sitharamanకు కేటీఆర్ లేఖ

ABN , First Publish Date - 2022-06-19T23:58:27+05:30 IST

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్‌ (Nirmala Sitharaman)కు మంత్రి కేటీఆర్ (KTR) లేఖ రాశారు.

Nirmala Sitharamanకు కేటీఆర్ లేఖ

హైదరాబాద్‌: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్‌ (Nirmala Sitharaman)కు మంత్రి కేటీఆర్ (KTR) లేఖ రాశారు. హెచ్‌సీఎల్‌, హెచ్ఎఫ్‌సీఎల్‌, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మా, HMT, CCI, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను కేంద్రం అమ్ముతోందని లేఖలో ప్రస్తావించారు. డిజిన్వెస్ట్మెంట్‌ ప్రణాళికల్లో భాగంగా కేంద్రం అమ్ముతోందని తప్పుబట్టారు. 6 సంస్థలకు గతంలో 7200 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. కేటాయించిన భూముల్లో కొత్త ఫ్యాక్టరీలను ప్రారంభించాలని కోరారు. లేదంటే ఆయా భూములను రాష్ట్రానికి  బదలాయించాలన్నారు. రాష్ట్రం ఇచ్చిన భూములను అమ్మేహక్కు కేంద్రానికి ఎక్కడిది? అని ప్రశ్నించారు. ప్రభుత్వ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని.. కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని లేఖలో కేటీఆర్ కోరారు.

Updated Date - 2022-06-19T23:58:27+05:30 IST