కుర్రాడి విన్యాసాలకు.. కేటీఆర్ ఆశ్చర్యం

ABN , First Publish Date - 2021-01-24T21:03:05+05:30 IST

మట్టిలో మాణిక్యం.. ఈ మాటకు అచ్చుగుద్దినట్టు సరిపోతాడు ఈ బుడతడు. జిమ్నాస్టిక్ విన్యాసాలను అలవోకగా చేస్తూ..

కుర్రాడి విన్యాసాలకు.. కేటీఆర్ ఆశ్చర్యం

ఇంటర్నెట్ డెస్క్: మట్టిలో మాణిక్యం.. ఈ మాటకు అచ్చుగుద్దినట్టు సరిపోతాడు ఈ బుడతడు. జిమ్నాస్టిక్ విన్యాసాలను అలవోకగా చేస్తూ.. అందరినీ అబ్బురపరుస్తున్నాడు. నెట్టింట ఈ అబ్బాయి విన్యాసాలను చూసిన తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ‘ఎవరీ అబ్బాయి’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒలింపిక్ మెడలిస్ట్ తర్ఫీదులో ఉన్నాడంటూ కితాబునిచ్చారు. అతను తెలంగాణా లేక మరో రాష్ట్రమా అంటూ ప్రశ్నించారు. ఈ అమోఘమైన ప్రతిభావంతుడికి మద్దతు ఇవ్వాలంటూ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.  


Updated Date - 2021-01-24T21:03:05+05:30 IST