భాగ్యనగరంలో భారీ వర్షాలపై ఫస్ట్ టైమ్ Minister KTR రియాక్షన్ ఇదీ..

ABN , First Publish Date - 2022-05-07T14:20:23+05:30 IST

భాగ్యనగరంలో భారీ వర్షాలపై ఫస్ట్ టైమ్ Minister KTR రియాక్షన్ ఇదీ..

భాగ్యనగరంలో భారీ వర్షాలపై ఫస్ట్ టైమ్ Minister KTR రియాక్షన్ ఇదీ..

హైదరాబాద్‌ : నానక్‌రామ్‌గూడలోని హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌ కార్యాలయంలో నగర అభివృద్ధిపై ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ, ఇతర విభాగాలు చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. వర్షాకాల ప్రణాళికను త్వరగా పూర్తి చేయాలని, భారీ వర్షాలు కురిసినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. అనంతరం జలమండలి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఎస్‌టీపీల నిర్మాణ పురోగతిని, మూసీ రివర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ కార్యక్రమాలను తెలుసుకున్నారు. లింకు రోడ్ల నిర్మాణం, వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేకంగా మాట్లాడారు. సమీక్ష అనంతరం ఔటర్‌ రింగ్‌ రోడ్డుపైన గ్రీనరీ నిర్వహణకు సంబంధించిన డ్రిప్‌ ఇరిగేషన్‌ వ్యవస్థను కేటీఆర్‌ ప్రారంభించారు. సమీక్షలో పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌, మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు.


Read more