దావోస్‌కు కేటీఆర్‌

Sep 20 2021 @ 02:23AM

జనవరిలో జరిగే వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సమావేశానికి ఆహ్వానం

కొవిడ్‌ సంక్షోభంలో తెలంగాణలో 

అమలైన విధానాలను వివరించండి

డబ్ల్యూఈఎఫ్‌ అధ్యక్షుడి పిలుపు

రాష్ట్ర ప్రగతికి దక్కిన గుర్తింపు: కేటీఆర్‌


హైదరాబాద్‌, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) సమావేశానికి మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం లభించింది. జనవరి 17 నుంచి 21 వరకు దావో్‌సలో జరగనున్న సమావేశంలో పాల్గొనాలని వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం అధ్యక్షుడు బోర్గ్‌ బ్రాండె ఆహ్వానించారు. కొవిడ్‌ సంక్షోభం తర్వాత రాష్ట్రంలో అమలు చేసిన వినూత్న విధానాలు, టెక్నాలజీ వినియోగం, ఎమర్జింగ్‌ టెక్నాలజీతో సామాన్యుల సమస్యల పరిష్కారం తదితర అనుభవాలను పంచుకోవాలని కేటీఆర్‌ను ఆయన కోరారు. ప్రస్తుతంప్రపంచం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని నివారించడంపై అన్ని దేశాలకు చెందిన రాజకీయ, వ్యాపార, పౌర సమాజానికి చెందిన నాయకులు కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.


వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం నుంచి అందిన ఆహ్వానం తెలంగాణ వినూత్న విధానాలకు, ప్రగతి ప్రస్థానానికి దక్కిన గుర్తింపుగా భావిస్తున్నానని కేటీఆర్‌ తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొనడం ద్వారా వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం వేదికగా తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో వ్యాపార అవకాశాలను ప్రపంచ దిగ్గజాలకు తెలియజేసి,  పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరుతామని వెల్లడించారు.

Follow Us on:

తెలంగాణ మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.