అటు భజరంగ్‌దళ్, VHP.. ఇటు ఓల్డ్ సిటీకి KTR.. టెన్షన్ టెన్షన్

ABN , First Publish Date - 2022-08-27T15:31:42+05:30 IST

ఓల్డ్ సిటీ(Old City) చాంద్రాయణగుట్ట(Chandrayangutta)లో హై టెన్షన్ చోటు చేసుకుంది.

అటు భజరంగ్‌దళ్, VHP.. ఇటు ఓల్డ్ సిటీకి KTR.. టెన్షన్ టెన్షన్

Hyderabad : ఓల్డ్ సిటీ(Old City) చాంద్రాయణగుట్ట(Chandrayangutta)లో హై టెన్షన్ చోటు చేసుకుంది. ఓ వైపు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్(BJP MLA Rajasingh) చేసిన వ్యాఖ్యలతో ఓల్డ్ సిటీ అంతా అగ్గి మీద గుగ్గిలమవతోంది. మరోవైపు భజరంగదళ్(Bhajarangdal, వీహెచ్‌పీ(VHP) కార్యకర్తలు సైతం రాజాసింగ్‌పై పీడీ యాక్ట్(PD Act) నమోదు చేయడంతో మండిపడుతున్నారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ ఓల్డ్ సిటీకి వెళ్లడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో భారీగా పోలీసుల బందోబస్తును ఏర్పాటు చేశారు. మరికాసేపట్లో చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం(Chandrayangutta Flyover Inaguration) జరగనుంది. ఈనెల 23న ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం కావాల్సి ఉండగా బీజేపీ నేతల(BJP Leaders) ఆందోళనలతో వాయిదా పడింది. రాజాసింగ్ అరెస్టు అనంతరం ఓల్డ్ సిటీలో ఘర్షణలతో చాంద్రాయణ గుట్టలో పోలీసులు హై అలర్ట్(High Alert) ప్రకటించారు. భజరంగ్‌దళ్, వీహెచ్‌పీ కార్యకర్తలు అడ్డుకుంటారనే సమాచారంతో భారీగా పోలీసులు మోహరించారు.

Updated Date - 2022-08-27T15:31:42+05:30 IST