ltrScrptTheme3

ktr vs revanth: కేటీఆర్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదు: సిటీ సివిల్ కోర్టు

Sep 21 2021 @ 18:04PM

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో, ఈడీ కేసులో మంత్రి కేటీఆర్‌పై ఎలాంటి వాఖ్యలు చేయకూడదని  రేవంత్ రెడ్డికి సిటీ సివిల్ కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చింది. తదుపరి విచారణను అక్టోబర్ 20 కి  కోర్టు వాయిదా వేసింది. కౌంటర్‌ దాఖలు చేయాలని రేవంత్‌రెడ్డికి కోర్టు నోటీసులు జారీ చేసింది. తన పరువుకు భంగం కల్గించారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ వేసిన పరువునష్టం దావా కేసుపై సిటీ సివిల్ కోర్టులో విచారణ జరిగింది. సిటీ సివిల్ కోర్టు మూడవ అదనపు సీనియర్ న్యాయమూర్తి దీనిని విచారించారు. 


పరువు నష్టం కేసులో ఇంజెక్షన్‌ ఆర్డర్‌పై వాదనలు ముగిసాయి. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని  కోర్టును కేటీఆర్‌ కోరారు. అయితే మధ్యంతర ఉత్తర్వులను సిటీ సివిల్‌ కోర్టు తొలుత రిజర్వ్‌ చేసింది. తనపై రేవంత్‌ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్‌ పిటిషన్‌ వేసారు. డ్రగ్స్‌ కేసుతో ముడిపెట్టి ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్ పిటిషన్ దాఖలు చేసారు. తప్పుడు ఆరోపణలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును పిటిషనర్ కోరారు. దీంతో డ్రగ్స్ కేసులో, ఈడీ కేసులో మంత్రి కేటీఆర్‌పై ఎలాంటి వాఖ్యలు చేయకూడదని సిటీ సివిల్ కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చింది. అనంతరం తదుపరి విచారణను అక్టోబర్ 20కి  కోర్టు వాయిదా వేసింది. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.