అబార్షన్ చేయించుకున్నాను.. తల్లి కావడానికి సిద్ధంగా లేనంటున్న Kubbra Sait

Published: Fri, 01 Jul 2022 18:52:05 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అబార్షన్ చేయించుకున్నాను.. తల్లి కావడానికి సిద్ధంగా లేనంటున్న Kubbra Sait

మోడల్, టీవీ హోస్ట్‌గా పలు పాత్రలు నిర్వహించిన అందాల భామ కుబ్రా సెయిట్ (Kubbra Sait). అనంతరం సినీ ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. ‘సేక్రేడ్ గేమ్స్’ (Sacred Games) వెబ్ సిరీస్‌తో ఫేమ్ సంపాదించుకున్నారు. తాజాగా ఆమె ‘‘ఓపెన్ బుక్: నాట్ ఏ క్వైట్ మెమోయిర్’ (Open Book: Not Quite A Memoir) టైటిల్‌తో పుస్తకాన్ని రాశారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక విశేషాలను ఈ పుస్తకంలో అభిమానులకు తెలిపారు. 


తాను తల్లి కావాలనుకోట్లేదని కుబ్రా సెయిట్ చెప్పారు. గతంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకున్నారు. ‘‘నేను 2013లో అండమాన్ ట్రిప్‌నకు వెళ్లాను. స్కూబా డైవింగ్‌ను ఆస్వాదించాను. అప్పుడు ఓ వ్యక్తితో బెడ్ షేర్ చేసుకున్నాను. శారీరకంగా దగ్గరయ్యాను. కొన్నాళ్లకు నాకు రుతుస్రావం తప్పిపోయింది. అప్పడు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని వచ్చింది. వారం రోజుల తర్వాత అబార్షన్ చేయించుకోవాలని నిర్ణయించుకున్నాను. నేను తల్లి కావడానికి సిద్ధంగా లేను. నేను ఊహించుకున్నట్టుగా నా జీవిత ప్రయాణం కొనసాగట్లేదు. ఇప్పటికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని అనుకోవట్లేదు. అమ్మాయిలు 23 ఏళ్లకు పెళ్లి చేసుకోవాలి. 30ఏళ్లకు పిల్లలను కనాలనే విషయాలు నాకు అర్థం కావు. అబార్షన్ చేయించుకున్నా ఎటువంటి విచారం లేదు. నా ఛాయిస్ నాకు ఉంటుంది. ప్రస్తుతం నా ఆలోచనల్లో స్పష్టత ఉందనుకుంటున్నాను. ఈ విషయాలను పంచుకోవడంలో ఎటువంటి ఇబ్బంది లేదని భావించాను. అందుకే ఈ పుస్తకాన్ని రాశాను. గతంలో జరిగిన వాటి నుంచి నేను కొన్ని అంశాలను నేర్చుకున్నాను. మరల అటువంటి పరిస్థితులు ఎదురయితే నా అప్రోచ్ వేరే విధంగా ఉంటుంది’’ అని కుబ్రా సెయిట్ చెప్పారు. తన కుటుంబానికి సన్నిహితమైన వ్యక్తి టీనేజీలో లైంగికంగా వేధించాడని కుబ్రా వెల్లడించారు. బాడీ షేమింగ్‌కు కూడా గురయ్యానని స్పష్టం చేశారు. ‘ఓపెన్ బుక్: నాట్ ఏ క్వైట్ మెమోయిర్’ పుస్తకంలో 24 అధ్యాయాలు ఉన్నాయి. ప్రతి అధ్యయం చదివించేలా ఆసక్తికరంగా ఉంది.    


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest News in Teluguమరిన్ని...