Hyderabad: కూకట్‎పల్లిలో యువకుడు దారుణ హత్య

ABN , First Publish Date - 2022-09-04T14:44:34+05:30 IST

కూకట్‌పల్లి(Kukatpally) దారుణ హత్య(murder) జరిగింది. కైతలాపూర్‌ గ్రౌండ్‌లో గుర్తు తెలియని దుండగులు యువకుడిని దారుణంగా

Hyderabad: కూకట్‎పల్లిలో యువకుడు దారుణ హత్య

Hyderabad: కూకట్‌పల్లి(Kukatpally) దారుణ హత్య(murder) జరిగింది. కైతలాపూర్‌ గ్రౌండ్‌లో గుర్తు తెలియని దుండగులు యువకుడిని దారుణంగా హత్య చేశారు. తలపై బండరాయితో కొట్టి హతమార్చారు. ఈ ఘటన స్థానికంగా కైతలాపూర్‎లో కలకలం రేపుతోంది. శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. యువకుడి మర్డర్ పై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యకు గల కారణాలు ఇంకా పూర్తిగా తెలియాల్సివుంది.

Updated Date - 2022-09-04T14:44:34+05:30 IST