
న్యూఢిల్లీ: రాబోయే సీజన్ కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర ఆదివారం నియమితుడయ్యాడు. ఫ్రాంచైజీ క్రికెట్ సంబంధిత ప్రణాళికలను సంగా పర్యవేక్షించనున్నాడు. రాయల్స్ బోర్డులో సంగా చేరిక జట్టును మరింతగా బలోపేతం చేసేందుకు దోహదపడుతుందని రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ చెప్పాడు.