ప్రమాదపుటంచున కుమరం భీం ప్రాజెక్టు

ABN , First Publish Date - 2022-08-10T04:16:18+05:30 IST

కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 45 వేల ఆయకట్టుకు సాగునీటిని అందించాలన్న లక్ష్యంతో దశాబ్దం క్రితం నిర్మించిన కుమరం భీం అడ ప్రాజెక్టు ప్రమాదపుటంచున నిలిచి రైతులకు, అధికారులకు వణుకు పుట్టిస్తోంది

ప్రమాదపుటంచున కుమరం భీం ప్రాజెక్టు
అధిక వర్షాలకు ఆనకట్ట కుంగి పోతుండడంతో టార్పాలిన్లతో తాత్కాలిక రక్షణ ఏర్పాటు చేసిన అధికారులు

- వినియోగంలోకి రాక ముందే బలహీన పడుతున్న ఆనకట్ట

- కుంగిపోతున్న పారాపెట్‌ వాల్‌

- నిర్మాణ లోపాలే కారణమా..?

- నీటి నిల్వ సామర్ధ్యాన్ని తగ్గించిన ఇంజనీర్లు

- వరదల నేపథ్యంలో ప్రమాదం జరుగవచ్చన్న అనుమానమే కారణం

- అక్టోబరు తర్వాతే మరమ్మతులు

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)

కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 45 వేల ఆయకట్టుకు సాగునీటిని అందించాలన్న లక్ష్యంతో దశాబ్దం క్రితం నిర్మించిన కుమరం భీం అడ ప్రాజెక్టు ప్రమాదపుటంచున నిలిచి రైతులకు, అధికారులకు వణుకు పుట్టిస్తోంది. గత 30 ఏళ్లలో ఎన్నడు లేని విధంగా ఈ సారి భారీ వర్షా లు కురుస్తున్నందున ఎగువ నుంచి భారీగా వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. దాంతో ప్రాజెక్టు నిర్మాణంలో చోటు చేసుకున్న లోపా లు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. వాస్తవానికి గత పదేళ్లుగా ఎప్పుడు కూడా సరైన స్థాయిలో నీటి నిల్వ లేక పోవడం వల్ల ఈ లోపా లు ఇన్నాళ్లు బయటపడలేదని చెబుతున్నారు. కాగా ఈ సారి జలాశ యం పూర్తి సామర్థ్యం పది టీఎంసీలకు నిల్వ చేసే స్థాయికి చేరడంతో స్పిల్‌వేకు ఆనుకొని గుట్ట నుంచి బ్యారేజీ గేట్ల వరకు నిర్మించిన పారాపెట్‌ వాల్‌ కుంగి పోవడం ప్రారంభించింది. అయితే నిర్మాణం సందర్భంగా సాంకేతికంగా సరైన ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని నీటి పారుదల రంగ నిపుణులు అంటున్నారు. జలాశయం అంతర్భాగంలో మట్టి కట్ట దెబ్బతినకుండా ఉండేందుకు రాళ్ల రివిటింగ్‌ చేయాల్సి ఉంటుంది. అయితే ఏ కారణం చేతో ఇక్కడ కేవలం ఫౌండే షన్‌ మాత్రమే కాంక్రీట్‌తో పూర్తి చేసి కట్టను కేవలం మట్టితోనే రోలింగ్‌ చేసి వదిలే సినట్టు అనుమానిస్తున్నారు. సహజంగా ఇక్కడి భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా మట్టి వదులుగా ఉండే స్వభావం కలిగి ఉన్నందున భారీ వర్షాలు పడడంతో కట్ట పైభాగం నుంచి మట్టి నాని పోయి కుంగి పోవడం ప్రారంభించిందని భావిస్తున్నారు. 

పది రోజుల క్రితం..

పది రోజుల క్రితం కట్టకుంగి పోవడాన్ని గమనించిన ప్రాజెక్టు ని ర్వాహణ సిబ్బంది అధికారులకు సమాచారం అందించడంతో ఆనకట్టకు పొంచి ఉన్న ప్రమాదం బయట పడింది. దాంతో అప్రమత్త మైన నీటి పారుదల శాఖ సిబ్బంది ఉన్నతాధికారుల సూచనల మేరకు నీటి ఎఫ్‌అర్‌ఎల్‌ స్థాయిని తగ్గించి ప్రాజెక్టును కాపాడే ప్రయత్నాల్లో తల మునకలయ్యారు. తాజాగా  రెండు రోజుల నుంచి ఆనకట్ట నుంచి నీరు లీకేజ్‌ అవుతోందని, మళ్లీ వర్షాలు కురుస్తుండడంతో ఆనకట్టకు ప్రమా దం సంభవిస్తే పరిస్థితేమిటని స్థానికులు తీవ్రంగా అందోళన చెందుతున్నారు. అయితే ఆనకట్టకు ప్రమాదమేమిలేదనేది అధికారుల వాదన. ప్రస్తుతం 10.39 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఈ జలాశయాన్ని 8.42 టీఎంసీలకు కుదించగా ఆనకట్టపై ఏర్పడిన కుంగుబాటు కారణంగా ప్రస్తుతం దానిని 6.82 టీఎంసీలకు పరిమితం చేశారు. మిగితా నీటిని అంతా దిగువకు వదిలేయడంతో ప్రస్తుతం రిజర్వాయర్‌ ఖాళీ అయిన నీటితో బోసి పోయి కన్పిస్తోంది. ఇదిలా ఉంటే ప్రాజెక్టు నిర్మించి దశాబ్ద కాలం అయినా కుడి, ఎడమ కాల్వల నిర్మాణం పూర్తి కాక పోవడంతో నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్టును ఇంకా ప్రభుత్వానికి అప్పగించలేదు. ప్రస్తు తం ఈ ప్రాజెక్టు నిర్మాణ సంస్థ ఆధీనంలోనే ఉంది. తాజా పరిస్థితుల్లో సాగు నీటి మాట అలా ఉంచితే అందుబాటులో ఉన్న నీరు కూడా చేప ల పెంపకం, మిషన్‌ భగీరథ పథకాలకు మాత్రమే వినియోగించే పరి స్థితి ఉందని చెబుతున్నారు. 

వరద నీరు దిగువకు..

కుమరం భీం ప్రాజెక్టు ఆనకట్ట పగుళ్లు, పారాపెట్‌ వాల్‌ కుంగి పో తుండడంతో అధికారులు ప్రాజెక్టు లోకి వచ్చే వరదను ఎప్పటికప్పుడు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఆనకట్టను మరమ్మతు చేయా లంటే ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యమయ్యే అవకాశాలు లేవని చెబుతు న్నారు. వర్షాలు తగ్గిన తర్వాత అక్టోబరు నుంచి మరమ్మతు పనులకు శ్రీకారం చుట్టే అవకాశం ఉందని నీటి పారుదల శాఖ వర్గాలు చెబుతు న్నాయి. కట్టను బలోపేతం చేయాలంటే ప్రస్తుతం ఉన్న పారాపెట్‌ వాల్‌ ను మీటరు లోతు వరకు మట్టిని తీసి తిరిగి ఆధునిక సాంకేతిక పరిజ్ఙా నంతో పనులు చేయాల్సి ఉంటుందన్నారు. అలాగే ఆనకట్టకు లోపలి వైపు, బయట వైపు లోపాలను సవరించేందుకు నిపుణుల సహ కారం తీసుకునే అవకాశాలున్నాయని చెబుతున్నారు. 

Updated Date - 2022-08-10T04:16:18+05:30 IST