Kumariలో వెనక్కి వెళ్లిన సముద్రం

ABN , First Publish Date - 2021-11-27T14:57:21+05:30 IST

కన్నియాకుమారి సముద్రతీరంలో సునామీ అనంతరం పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. హఠాత్తుగా సముద్రం వెనకకు పోవడం, అలలు ఉధృతంగా ఎగసిపడడం, నీరు రంగు మారడం, ఒక్కోసారి అలలు

Kumariలో వెనక్కి వెళ్లిన సముద్రం

పెరంబూర్‌(చెన్నై): కన్నియాకుమారి సముద్రతీరంలో సునామీ అనంతరం పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. హఠాత్తుగా సముద్రం వెనకకు పోవడం, అలలు ఉధృతంగా ఎగసిపడడం, నీరు రంగు మారడం, ఒక్కోసారి అలలు లేకపోవడం తదితర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు తీవ్రరూపం దాల్చడంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో, శుక్రవారం ఉదయం కన్నియా కుమారి త్రివేణి సంగమం ప్రాంతంలో హఠాత్తుగా సముద్రం వెనక్కి వెళ్లడంతో ఆ ప్రాంతంలో భారీ బండరాళ్లు బయటపడ్డాయి. ఈ కారణంగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలకు వచ్చిన భక్తులు తీవ్ర నిరాశకు గురయ్యారు. వాతావరణ పరిస్థితులను బట్టి సముద్రతీర ప్రాంతాలకు సందర్శకులు వెళ్లరాదని కోస్ట్‌గార్డ్‌, పోలీసులు లౌడ్‌ స్పీకర్ల ద్వారా హెచ్చరించారు.

Updated Date - 2021-11-27T14:57:21+05:30 IST