కుంభకోణంలో వైభవంగా రథోత్సవం

ABN , First Publish Date - 2022-05-15T16:56:48+05:30 IST

తంజావూరు జిల్లాలో ఆలయాల నగరంగా ప్రసిద్ధిచెందిన కుంభకోణం సారంగపాణి స్వామి ఆలయంలో శనివారం వైభవంగా రథోత్సవం జరిగింది. 108 వైష్ణవ క్షేత్రాల్లో

కుంభకోణంలో వైభవంగా రథోత్సవం

ప్యారీస్‌(చెన్నై): తంజావూరు జిల్లాలో ఆలయాల నగరంగా ప్రసిద్ధిచెందిన కుంభకోణం సారంగపాణి స్వామి ఆలయంలో శనివారం వైభవంగా రథోత్సవం జరిగింది. 108 వైష్ణవ క్షేత్రాల్లో మూడవదిగా పేరుగాంచిన ఈ ఆలయంలో చిత్తిరై మహోత్సవాలు ఈ నెల 6న ధ్వజారోహణంతో ప్రారంభమై ప్రతిరోజు వివిధ వాహనాల్లో ఉత్సవమూర్తులను పురవీధుల్లో ఊరేగిస్తున్నారు. ప్రధానాంశమైన రథోత్సవం శనివారం నిర్వహించగా, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. శ్రీదేవి భూదేవి సమేత ప్రత్యేక అలంకరణలో సారంగపాణి స్వామివార్లు రథంలో కొలువుదీరి భక్తులను కటాక్షించారు. రాష్ట్రంలోని ఆలయాల్లో అతిపెద్ద రథాల్లో సారంగపాణి స్వామి ఆలయ రథం ఒకటి. 110 అడుగుల ఎత్తు, 450 టన్నుల బరువు, నాలుగు గుర్రాలు, సృష్టికర్త బ్రహ్మ రథసారధి విగ్రహంతో శిల్ప కళాకారులు రథోత్సవం కోసం రథాన్ని అందంగా తీర్చిదిద్దారు.

Updated Date - 2022-05-15T16:56:48+05:30 IST